Yadadri Bhuvanagiri: బోల్లేపల్లిలో దొంగల కలకలం.. రైతుల పాడి పశువుల మాయం!

Yadadri Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లా బోల్లేపల్లి గ్రామంలో వరుస పశువుల దొంగతనాలు కలకలం రేపుతున్నాయి.

T RAMREDDY, BHONAGIRI
Published on: 12 May 2026 10:15 AM IST
Yadadri Bhuvanagiri
X

Yadadri Bhuvanagiri: బోల్లేపల్లిలో దొంగల కలకలం.. రైతుల పాడి పశువుల మాయం!

యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి మండలం బోల్లేపల్లి గ్రామంలో అర్ధరాత్రి దొంగల బీభత్సం చోటుచేసుకుంది. గోదా సత్యనారాయణ, చింతల వెంకటేష్ అనే రైతులకు చెందిన పాడి పశువులను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఇప్పటికే గత పదిహేను రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన గోదా రమేష్ అనే రైతు పశువులను కూడా దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన గ్రామస్తుల్లో భయాందోళనలు కలిగిస్తోంది. వరుసగా జరుగుతున్న పశువుల దొంగతనాలపై గ్రామస్తులు పోలీసుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. రాత్రి వేళల్లో పోలీసు గస్తీ పెంచి, దొంగలను వెంటనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు మరియు గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

T RAMREDDY, BHONAGIRI

T RAMREDDY, BHONAGIRI

Next Story