Bhongiri: వడ్లు కొనకపోవడంతో రైతుల ఆగ్రహం.. నిలిచిన ట్రాఫిక్

Bhongiri: యాదాద్రి జిల్లా రామన్నపేటలో అన్నదాతల ఆగ్రహం. ఐకేపీ సెంటర్లలో వడ్ల కొనుగోలు నిలిచిపోవడం, మిల్లర్ల కోతలపై రైతులు చిట్యాల-భువనగిరి రహదారిపై రాస్తారోకో.

KARAMPURI MADHU, CHITYALA
Published on: 4 May 2026 2:43 PM IST
Bhongiri
X

Bhongiri: వడ్లు కొనకపోవడంతో రైతుల ఆగ్రహం.. నిలిచిన ట్రాఫిక్

Bhongiri: రోడ్డెక్కిన అన్నదాతలు మార్కెట్లో ఆరబోసిన వడ్లను కొనడం లేదని ఆగ్రహించిన రైతన్నలు రోడ్డెక్కి రాస్తారోకో చేస్తున్నారు. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలము కక్కెరేని గ్రామానికి చెందిన రైతులు ఐకెపి సెంటర్లో వడ్లను కొనుగోలు చేయడం లేదని కొనుగోలు ప్రక్రియ నిదానంగా జరుగుతుందని మిల్లర్లు భారీగా కోతలు విధించి రైతులను మోసం చేసి దోచుకుంటుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ రామన్నపేట కేంద్రంలో చిట్యాల - భువనగిరి రహదారిపై రైతుల రాస్తారోకో చేశారు

దాంతో నల్లగొండ భువనగిరి రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులకు సర్దిచెపె ప్రయత్నంలో పోలీసులకు రైతులకు మధ్య భాగవాదం జరిగింది బలవంతంగా రైతులను రోడ్డుపై నుండి తీసి పక్కకు పంపారు.

KARAMPURI MADHU, CHITYALA

KARAMPURI MADHU, CHITYALA

Next Story