Addanki: ఊరచెరువు పునరుద్ధరణకు రూ.5.10 కోట్లు: మంత్రి గొట్టిపాటి!
Addanki: ప్రకాశం జిల్లా అద్దంకి ఎన్టీఆర్ నగర్ కాలనీ ఊరచెరువు పునరుద్ధరణ పనులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ శంకుస్థాపన చేశారు.
Addanki: ఊరచెరువు పునరుద్ధరణకు రూ.5.10 కోట్లు: మంత్రి గొట్టిపాటి!
అద్దంకి: అద్దంకి మున్సిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కాలనీ ఊరచెరువు పునరుద్ధరణకు రూ.5.10 కోట్ల అమృత్ 2.0 నిధులతో చేపట్టిన పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.
అద్దంకి ఊరచెరువు భూ ఆక్రమణలు అరికట్టాలన్నారు త్వరితగతిన పూర్తి స్థాయిలో పునరుద్ధరించి, వాకింగ్ ట్రాక్‌లు, పచ్చదనం, రంగురంగుల పూల మొక్కలు, ఆధునిక పార్కులతో సుందరీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి తెలిపారు.
అద్దంకి పట్టణాన్ని అన్ని వార్డులలో మరింత సుందరంగా, ఆధునికంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు.




