Mothkur: రూ. 15 కోట్ల నిధులపై ‘దొంగ చాటు’ టెండర్లు కౌన్సిలర్ల ఆందోళన!
Mothkur:
Mothkur: రూ. 15 కోట్ల నిధులపై ‘దొంగ చాటు’ టెండర్లు కౌన్సిలర్ల ఆందోళన!
మోత్కూర్: మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం మంజూరైన రూ. 15 కోట్ల నిధులపై పాలకవర్గానికి సమాచారం లేకుండా మున్సిపల్ కమిషనర్ టెండర్ నోటిఫికేషన్ వేయడంపై మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న, కాంగ్రెస్, బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
టెండర్ నోటిఫికేషన్ పై అడిగేందుకు కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి రాగా కమిషనర్ ఆఫీస్ కు రాకుండా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంపై అసహనం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయం వద్ద వారు విలేకరులతో మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ భర్త, కమిషనర్ కుమ్మక్కై కమిషన్ల కోసమే కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకుండా దొంగ చాటుగా టెండర్ నోటిఫికేషన్ వేశారని ఆరోపించారు.
కొత్త కమిషనర్ వచ్చి నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకు జనరల్ సమావేశం ఏర్పాటు చేయడం లేదని, మున్సిపాలిటీలో నిల్వ ఉన్న రూ.కోటి 27 లక్షల లెక్కలు చెప్పడం లేదని, మాజీ చైర్మన్, ప్రస్తుత చైర్మన్ భర్త మున్సిపాలిటీపై పెత్తనం ఎక్కువైందన్నారు.
మున్సిపాలిటీ కి వచ్చిన 15 కోట్ల నిధులతోనే ఎన్నికల్లో డెవలప్మెంట్ పనులు చేస్తామని హామీ ఇచ్చామని, స్థానిక ఎమ్మెల్యే ఏకపక్షంగా మాకు తెలియకుండా పనులు ఖరారు చేసి సింగిల్ టెండర్ తో పనులు ఖరారు చేయడంతో 9 మంది కౌన్సిలర్లు తీర్మానం చేసి ఆ టెండర్ను రద్దు చేయించామని తెలిపారు.
వార్డులో మురికి కాలువలు, సిసి రోడ్లు ప్రజావసరాలు ఉన్న పనులు కాకుండా ఇష్టా రాజ్యాంగ పనులు పెట్టారని ఆరోపించారు. చైర్మన్ రాకుండా చైర్మన్ భర్త అన్ని వార్డుల్లో పెత్తనం చెలాయిస్తున్నాడని, కౌన్సిలర్లను కాదని చైర్మన్ భర్త పెత్తనం చేస్తే ఒప్పుకోమని హెచ్చరించారు.




