Nalgonda: చండూర్ మార్కెట్‌లో వ్యాపారులను బెదిరించిన ముఠా అరెస్ట్!
Nalgonda: ధాన్యపు వ్యాపారులను బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి రూ.9.80 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
Nalgonda: చండూర్ మార్కెట్‌లో వ్యాపారులను బెదిరించిన ముఠా అరెస్ట్!
నల్గొండ: చండూర్ మార్కెట్ యార్డులో సరకు కొనుగోలుకు వచ్చిన ధాన్యపు వ్యాపారులను అడ్డగించి, బెదిరించి దౌర్జన్యంగా దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు. బాధితులను బెదిరించి, రూ.5 లక్షల చొప్పున డిమాండ్ చేసి వసూళ్లకు ఒడిగట్టిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి రూ.9.80 లక్షల నగదు, 11 సెల్‌ఫోన్లు, ఒక బోలెరో వాహనాన్ని (TS 07 UK 4505) స్వాధీనం చేసుకున్నట్లు చండూర్ సీఐ రాము తెలిపారు.




