Bhuvanagiri: చుట్టమని నమ్మితే ముంచాడు.. మాజీ చైర్మన్‌పై మహిళ ఫైర్!

Bhuvanagiri: మాజీ మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు తనను నమ్మించి తాతల ఆస్తిని కబ్జా చేశారని వాసాలమర్రికి చెందిన పలుగుల శ్రీవాణి అనే మహిళ ఆరోపించారు.

RAJESH,	WEST ZONE
Published on: 11 Jun 2026 8:08 PM IST
Bhuvanagiri
X

Bhuvanagiri: చుట్టమని నమ్మితే ముంచాడు.. మాజీ చైర్మన్‌పై మహిళ ఫైర్!

Bhuvanagiri: తమకు తాత ద్వారా సంక్రమించిన ఆస్తిని నమ్మించి తనతో సంతకం చేయించుకొని కబ్జా చేశారని యాదాద్రి మాజీ మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు పై పలుగుల శ్రీవాణి అనే మహిళ ఆరోపణలు చేశారు. సోమాజిగూడ,ప్రెస్ క్లబ్లో వాసాలమర్రికి చెందిన పలుగుల శ్రీవాణి అనే మహిళ విలేకరుల సమావేశం నిర్వహించారు. తమ నాయనమ్మ తమ్ముడి కొడుకు వరుసకు తనకు మామ అయిన యాదాద్రి మాజీ మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు తనకు ఎనిమిది ప్లాట్లు 80 లక్షల నగదును ఇస్తానని బాండ్లపై సంతకాలు చేయించుకొని మోసం చేశాడని అన్నారు.

ఆయనపై న్యాయపోరాటం చేస్తున్న తాను ఇప్పటికే అతని ఇంటి ముందు ఆత్మహత్య ప్రయత్నం చేసి బ్రతికి వచ్చానని అన్నారు. ఇప్పుడు గుర్తుతెలియని వ్యక్తులు పోతంశెట్టి వెంకటేశ్వర్ల అనుచరులు తమ చుట్టూ తిరుగుతూ భూమిని వదులుకోవాలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. పోతంశెట్టి వెంకటేశ్వర్ల నుండి తమ భూమి తమకు ఇప్పించి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులకు , రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మహిళ విజ్ఞప్తి చేశారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story