Yadadri: యాదాద్రి మర్డర్ మిస్టరీ వీడింది: స్నేహితుడే హంతకుడు!
Yadadri: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మర్యాల శివారులో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు.
Yadadri: యాదాద్రి మర్డర్ మిస్టరీ వీడింది: స్నేహితుడే హంతకుడు!
Yadadri: యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచలనం సృష్టించిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. బొమ్మలరామరం మండలంలో జరిగిన ఈ మిస్టరీ మర్డర్ కేసు, నెలరోజుల తర్వాత అసలు నిజం బయటపడింది. గత నెల రెండవ తేదీన… మర్యాల గ్రామ శివారులో పూర్తిగా తగలబెట్టిన ఓ శవం లభ్యమైంది. శవం పూర్తిగా కాలిపోవడంతో గుర్తింపు కష్టమై… కేసు మిస్టరీగా మారింది. ఎలాంటి క్లూ లేకపోయినా… పోలీసులు వెనుకడుగు వేయలేదు.
సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా, ప్రతి చిన్న అంశాన్ని పరిశీలిస్తూ… చివరకు ఈ హత్య వెనుక ఉన్న నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అల్వాల్‌కు చెందిన పొన్నకంటి కాశీ, పొన్నకంటి శేఖర్ ఇద్దరూ ప్రాణ స్నేహితులు… బంధువులు కూడా. జీవనోపాధి కోసం చెత్త సేకరిస్తూ… రాగి తీగలు దొంగతనం చేస్తూ జీవనం సాగించేవారు.
ఒకరోజు… దొంగతనం చేస్తుండగా శేఖర్ యజమానికి దొరికిపోయాడు. ఆ సమయంలో… “నేను ఒక్కడినే కాదు, కాశీ కూడా ఉంది” అని చెప్పడంతో… ఇద్దరిపై పెద్దమనుషులు కలిపి 40 వేల రూపాయల జరిమానా విధించారు. ఈ సంఘటనతో… పరువు పోయిందని భావించిన కాశీ… కోపంతో ఊగిపోయాడు. అదే కోపం చివరకు దారుణానికి దారి తీసింది.
శేఖర్‌ను మద్యం తాగించి… యాదాద్రి జిల్లా మర్యాల శివారుకు తీసుకెళ్లి… కాశీ హత్య చేశాడు. అంతటితో ఆగకుండా… నేరాన్ని దాచేందుకు శవాన్ని పెట్రోల్‌తో తగలబెట్టాడు. కానీ… పోలీసులు మాత్రం నిందితుడిని వదల్లేదు. ఆధునిక సాంకేతికతతో కేసును ఛేదించి… అసలు నిందితుడు కాశీని అరెస్ట్ చేశారు.
ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను భువనగిరి రూరల్ సీఐ చంద్రబాబు వెల్లడించారు.




