Yadadri: ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని మహిళపై అత్యాచారం!

Yadadri: ఆత్మకూరు(ఎం) మండలం పుల్లాయిగూడెంలో దారుణం. ఇందిరమ్మ ఇల్లు ఆశ చూపి మహిళపై అత్యాచారం చేసినట్లు కాంగ్రెస్ నేతపై ఆరోపణలు, పోలీస్ కేస్ నమోదు.

T RAMREDDY, BHONAGIRI
Published on: 21 Aug 2026 4:25 PM IST
Yadadri
X

Yadadri: ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని మహిళపై అత్యాచారం!

Yadadri: యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పుల్లాయిగూడెం గ్రామంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని, సిమెంట్ బస్తాలు ఇస్తానని చెప్పి మహిళను ఇంటికి పిలిపించి అత్యాచారం చేసినట్లు కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు మాలి శంకర్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి.

ఈ ఘటన విషయం బాధితురాలి భర్తకు తెలియడంతో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించినట్లు సమాచారం. అయితే పోలీసులకు ఫిర్యాదు చేయకుండా బాధితురాలు, ఆమె భర్తను బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

కేసు పెట్టకుండా ఉండేందుకు బాధితురాలి కుటుంబానికి అర ఎకరం భూమి ఇస్తామని గ్రామ పెద్దల ద్వారా రాయబారం నడిపినట్లు సమాచారం. దీంతో బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించారు.

ఆత్మకూరు(ఎం) పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి ఫిర్యాదు, పోలీసుల దర్యాప్తు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి రావాల్సి ఉంది.

T RAMREDDY, BHONAGIRI

T RAMREDDY, BHONAGIRI