Karl Swanberg: భారత పర్యటనలో స్వీడన్ ఇన్‌ఫ్లూయెన్సర్ కార్ల్.. తాజ్ మహల్, హంపి సందర్శన!
Karl Swanberg: భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రత్యేక ఆహ్వానంపై స్వీడన్‌కు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ కార్ల్ స్వాన్‌బర్గ్ భారత్‌లో పర్యటించారు.
Karl Swanberg: భారత పర్యటనలో స్వీడన్ ఇన్‌ఫ్లూయెన్సర్ కార్ల్.. తాజ్ మహల్, హంపి సందర్శన!
Karl Swanberg: భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ, స్వీడన్‌లోని భారత రాయబార కార్యాలయం సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక ‘ఫ్యామిలరైజేషన్ విజిట్’ లో స్వీడన్‌కు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ కార్ల్ స్వాన్‌బర్గ్ పాల్గొన్నారు. స్వీడన్ నుంచి ఎంపికైన ప్రతినిధుల్లో ఒకరిగా తన భార్య ఎకటెరినా స్వాన్‌బర్గ్‌తో కలిసి ఆయన ఈ పర్యటనకు విచ్చేశారు.
కార్ల్ స్వాన్‌బర్గ్ దంపతులు భారతదేశంలో 10 రోజుల పాటు పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా దేశంలోని అత్యంత ప్రముఖమైన పర్యాటక, చారిత్రక, సాంస్కృతిక మరియు ఆధునిక నగరాలను వారు సందర్శించారు.
దేశ రాజధాని న్యూఢిల్లీలో పర్యటించిన వీరు.. రాష్ట్రపతి భవన్, చారిత్రక హుమాయూన్ సమాధి, ఇండియా గేట్‌లను సందర్శించారు. అనంతరం ఆగ్రాలోని ప్రపంచ వింత తాజ్ మహల్‌ను చూసి అబ్బురపడ్డారు.
ఆ తర్వాత దక్షిణ భారతదేశ పర్యటనలో భాగంగా కర్ణాటకలోని ప్రపంచ వారసత్వ సంపద హంపిని సందర్శించి.. అక్కడి విరూపాక్ష ఆలయం, అంజనాద్రి కొండల విశిష్టతను తెలుసుకున్నారు. అలాగే ఐటీ హబ్ బెంగళూరులోని లాల్‌బాగ్ బొటానికల్ గార్డెన్, విధాన సౌధలను సందర్శించారు.
భారతదేశంలోని వైవిధ్యమైన సంస్కృతి, పురాతన వారసత్వం, ఇక్కడి ప్రజల ఆతిథ్యం మరియు సంప్రదాయాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని కార్ల్ స్వాన్‌బర్గ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ 10 రోజుల పర్యటనకు సంబంధించిన ప్రతి అద్భుతమైన అనుభవాన్ని, ఫొటోలను, వీడియోలను ఆయన తన సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఫాలోవర్లతో పంచుకున్నారు. భారతదేశ వైవిధ్యం, పర్యాటక రంగం మరియు ఆధునిక అభివృద్ధిని అంతర్జాతీయ స్థాయికి పరిచయం చేయడంలో ఈ పర్యటన కీలక పాత్ర పోషించింది.




