Hyderabad: తెలంగాణ రైజింగ్-2047: సీఎం రేవంత్ రెడ్డి 'త్రీ-లెవెల్' మాస్టర్ ప్లాన్
Hyderabad: తెలంగాణ రైజింగ్-2047 మాస్టర్ ప్లాన్‌ను వివరించిన సీఎం రేవంత్ రెడ్డి.
Hyderabad: తెలంగాణ రైజింగ్-2047: సీఎం రేవంత్ రెడ్డి 'త్రీ-లెవెల్' మాస్టర్ ప్లాన్
Hyderabad: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆధునీకరణ, పట్టణీకరణతో భవిష్యత్ లో మరిన్ని కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం.
సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దే ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాం.. అండర్ పాస్, సర్ఫేస్, ఎలివేటెడ్ అనే త్రీ లెవెల్ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించుకున్నాం. ట్రాఫిక్ నియంత్రణకు కేవలం రోడ్ల విస్తరణ మాత్రమే సరిపోదు… మల్టీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.
పార్కింగ్ ఇబ్బందులను అధిగమించేందుకు నగరంలో మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రాన్ని మూడు భాగాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాం. CURE, PURE, RARE గా అభివృద్దిని మూడు భాగాలుగా విభజించుకున్నాం. ఔటర్ రింగ్ రోడ్డు CURE ఏరియాను సర్వీస్ సెక్టార్ గా గుర్తించాం.
ఔటర్ రింగ్ రోడ్డు బయట, రీజనల్ రింగ్ రోడ్డు లోపల ఉన్న PURE ఏరియాను మాన్యూఫ్యాక్చర్ సెక్టార్ గా గుర్తించాం. రీజనల్ రింగ్ రోడ్డు బయట ఉన్న RARE ఏరియాను అగ్రికల్చర్ సెక్టార్ గా గుర్తించాం. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి సంబంధించి తెలంగాణ రైజింగ్-2047 మాస్టర్ ప్లాన్ ను ఆవిష్కరించుకున్నాం. మూసీ రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేయడంతో పాటు మన సంస్కృతికి అనుసంధానించబోతున్నాం.
నగరంలో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా హైదరాబాద్ లో ఆర్టీసీలో ఈవీ బస్సులను తీసుకొస్తున్నాం. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఆటోలకు ఉచితంగా రెట్రో ఫిట్టింగ్ చేయించి ఈవీ వాహనాలుగా మార్చబోతున్నాం.




