Puducherry: కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి.. హామీల అమలుకు కట్టుబడి ఉన్నాం

Puducherry: పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 April 2026 9:37 PM IST
Puducherry
X

Puducherry: కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి.. హామీల అమలుకు కట్టుబడి ఉన్నాం

Puducherry: ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణ కు, రాజ్యాంగం మనకు కల్పించిన గౌరవం, స్వేచ్ఛను కాపాడుకోవాలంటే కాంగ్రెస్, డీఎంకే కూటమి బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీ తో గెలిపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్, పుదుచ్చేరి pcc అధ్యక్షుడు విద్యలింగం తో కలిసి పుదుచ్చేరి లోని మనవేలి అసెంబ్లీ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో నిలిచిన అనంతరామన్ కు, ఎం బాలం నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా బరిలో నిలిచిన లక్ష్మీకాంత న్ కు మద్దతుగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్థానికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీ ని తిరిగి అధికారంలోకి తీసుకురండి పుదుచ్చేరిని రక్షించండి అని ఓటర్లకు డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. కాంగ్రెస్, డీఎంకే పార్టీలతో కూడిన spa కూటమి ఇచ్చిన హామీల అమలు కు కట్టుబడి ఉంటుందని భరోసా ఇచ్చారు. మా కూటమి హామీల అమలు పై nda కూటమి చేస్తున్న అసత్యాలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని అన్నారు. పుదుచ్చేరి బంగారు భవిష్యత్తుకు spa కూటమిని గెలిపించడం ఒక్కటే పరిష్కార మార్గం అన్నారు.

గ్యారంటీలు అమలు సాధ్యమా అని కొంద‌రు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నార‌ని.. దానికి స‌మాధానం తెలంగాణ రాష్ట్రమే అని డిప్యూటీ సీఎం అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి క్యాబినెట్ స‌మావేశం నుంచే గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. 25 ల‌క్ష‌ల రైతు కుటుంబాల‌కు చెందిన రూ.21 వేల కోట్ల రుణాల‌ను తాము మాఫీ చేశామ‌ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సాగు చేసుకునే రైతుల‌కు ఎక‌రాకు రూ.12 వేలు చొప్పున ఏడాదికి రూ.18 వేల కోట్లు రైతు భ‌రోసా కింద అంద‌జేస్తున్నామ‌ని డిప్యూటీ సీఎం తెలిపారు.

67,173 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, వివిధ శాఖల్లో నియామకాలు పూర్తి చేయ‌డంతో పాటు ప్ర‌జ‌ల స‌మ‌క్షంలో ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశామని డిప్యూటీ సీఎం వివ‌రించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌక‌ర్యం క‌ల్పించామ‌ని, 10 వేల‌ బస్సులు, 50 వేల‌ సిబ్బందితో ఉన్న ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకువచ్చామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఉచిత బ‌స్సు ప్ర‌యాణంతో మహిళలకు నెలకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వ‌ర‌కు ఆదా అవుతోందన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి, ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నామ‌ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్ల‌డించారు.

రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తున్నామ‌న్నారు. మ‌హిళ‌ల‌ను బస్సుల యజమానులుగా, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామ‌ని డిప్యూటీ సీఎం తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజ‌న్ డాక్యుమెంట్ -2047 ప్ర‌కారం తెలంగాణ‌ను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా నిల‌ప‌నున్నామ‌ని డిప్యూటీ సీఎం ధీమా వ్య‌క్తం చేశారు. తెలంగాణ వృద్ధిరేటు 10.8 శాతంగా ఉంద‌ని, పన్నులు పెంచకుండానే అభివృద్ధి సాధ్యమని తాము నిరూపించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story