Gunjaluru: ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల గృహప్రవేశంలో కాంగ్రెస్ నేతలు
Gunjaluru: ఛివ్వేంల మండలం గుంజలూరులో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొని పేదలకు ఇళ్లు అందిస్తామని తెలిపారు.
Gunjaluru
సూర్యాపేట జిల్లా: ఛివ్వేంల మండలం గుంజలూరు గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు పొందిన లబ్ధిదారులు పెద్ది ధనమ్మ, నర్సయ్య దంపతుల గృహప్రవేశ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ధారావత్ వీరన్న నాయక్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ, ఇండ్లు లేని ప్రతి నిరుపేదకు పక్కా ఇల్లు కట్టించి ఇవ్వడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి దశలవారీగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు గుర్తుచేశారు. ప్రతి ఏడాది నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున మంజూరు చేసి ప్రతి పేదోడికి సొంతిల్లు నిర్మించి ఇస్తామని వెల్లడించారు.
“ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేరుతోంది. పేద ప్రజల సంక్షేమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. పేదల ముఖంలో చిరునవ్వు చూడటమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం” అని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని చెప్పి పదేళ్లు ఊరించిందని, ఒక్కరికైనా పక్కా ఇల్లు ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే పేదలకు నిజమైన న్యాయం జరుగుతోందని అన్నారు.
ఈ కార్యక్రమంలో గుంజలూరు సర్పంచ్ బొల్లికొండ సైదులు, ఉప సర్పంచ్ దొనకొండ పావని మహేష్, పీసీ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ చింతమళ్ల రమేష్, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా రానున్న రోజుల్లో మరింత మంది పేదలకు లబ్ధి చేకూరుతుందని సర్వోత్తమ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.




