Nandyal: నంద్యాలలో ఎక్సైజ్ సీఐ వరలక్ష్మిపై విచారణ వేగవంతం

Nandyal: నంద్యాల జిల్లా డోన్‌లో ఎక్సైజ్ సీఐ వరలక్ష్మిపై ఆరోపణలపై ఎక్సైజ్ ఎస్పీ రవికుమార్ స్వయంగా విచారణ చేపట్టి రికార్డులు పరిశీలించారు.

Bharat Raj, Dhone
Published on: 29 April 2026 6:57 AM IST
Nandyal
X

Nandyal

Nandyal: నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఎక్సైజ్ శాఖ సీఐ వరలక్ష్మిపై వచ్చిన ఆరోపణలపై నిజ నిర్ధారణకు అధికారులు చర్యలను వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ స్వయంగా రాత్రి సమయంలో డోన్ ఎక్సైజ్ స్టేషన్‌కు చేరుకుని విచారణ చేపట్టారు.

విచారణలో భాగంగా పలు కీలక రికార్డులు, కేసులకు సంబంధించిన వివరాలను సమగ్రంగా పరిశీలించారు. సంబంధిత అధికారులను ప్రశ్నిస్తూ ఆరోపణలపై స్పష్టతకు ప్రయత్నించారు.

విచారణ పూర్తయిన అనంతరం పూర్తి వివరాలను మీడియా సమావేశం ద్వారా వెల్లడిస్తామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు. ఈ ఘటనపై ప్రస్తుతం జిల్లాలో ఆసక్తి నెలకొంది.

Bharat Raj, Dhone

Bharat Raj, Dhone

Next Story