Hyderabad: మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు నరహరి, అతని భార్య లొంగుబాటు!

Hyderabad: మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. సెంట్రల్ కమిటీ సభ్యుడు నరహరి, ఆయన భార్య తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ఎదుట లొంగిపోయారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 26 May 2026 9:45 AM IST
Hyderabad
X

Hyderabad: మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు నరహరి, అతని భార్య లొంగుబాటు!

Hyderabad: మావోయిస్టు ఉద్యమానికి భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు సమాచారం. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు నరహరి, ఆయన భార్య అధికారుల ఎదుట లొంగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం వెలుగులోకి వచ్చింది. తెలంగాణకు చెందిన నరహరి, జార్ఖండ్‌కు చెందిన ఆయన భార్య లొంగుబాటుపై కొంతకాలంగా ప్రచారం జరుగుతుండగా, ఎట్టకేలకు వారు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను డీజీపీ సీవీ ఆనంద్ ఈరోజు నిర్వహించనున్న మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు.

మావోయిస్టు సెంట్రల్ కమిటీలో ప్రస్తుతం మిగిలిన కీలక నేతలు చాలా తక్కువగా ఉన్నట్లు భద్రతా వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే పలువురు అగ్రనేతలు ఎన్‌కౌంటర్లలో మృతి చెందగా, మరికొందరు లొంగిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నరహరి లొంగుబాటుతో సెంట్రల్ కమిటీలో వార్త శేఖర్ అలియాస్ మంగ్తు, గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ్ రావు మాత్రమే అజ్ఞాతంలో ఉన్న కీలక నేతలుగా భావిస్తున్నారు.

నరహరి లొంగుబాటుతో ప్రస్తుతం ఆక్టివ్‌గా ఉన్న సెంట్రల్ కమిటీ నాయకుడిగా వార్త శేఖర్ మాత్రమే మిగిలినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు సుదీర్ఘకాలం మావోయిస్టు ఉద్యమాన్ని నడిపించిన గణపతి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఆయన లొంగుబాటుపై ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story