Nagarjuna Sagar: నాగార్జున సాగర్‌కు నిలకడగా ఇన్‌ఫ్లో
Nagarjuna Sagar: నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద నీటి మట్టం నిలకడగా కొనసాగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం నాటికి ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో వివరాలు, కాలువలకు విడుదల.
Nagarjuna Sagar: నాగార్జున సాగర్‌కు నిలకడగా ఇన్‌ఫ్లో
Nagarjuna Sagar: నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద నీటి మట్టం నిలకడగా కొనసాగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయానికి జలాశయానికి 13,944 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అంతే మొత్తంలో బయటకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గానూ 532.50 అడుగుల వద్ద ఉంది.
నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 173.06 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎడమ కాలువకు 6,556 క్యూసెక్కులు, కుడి కాలువకు 5,088 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మధ్యాహ్నం నాటికి క్రస్ట్ గేట్లు మూసివేసి ఉన్నాయి.
Next Story




