Siddipet: తోగుటలో సిరి సీడ్స్ వరి ప్రదర్శనకు రైతుల స్పందన

Siddipet: సిద్దిపేట తోగుటలో సిరి సీడ్స్ రైతు క్షేత్ర ప్రదర్శనలో అధిక దిగుబడి వరి విత్తన లక్షణాలు వివరించారు.

KARUNAKAR,	DUBBAK
Updated on: 29 April 2026 10:00 AM IST
Siddipet
X

 Siddipet

Siddipet: సిద్దిపేట జిల్లా తోగుట మండలంలో రైతు సీత బాలయ్య క్షేత్రంలో సిరి సీడ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు క్షేత్రస్థాయి ప్రదర్శన కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని పంట పరిస్థితులను పరిశీలించారు.

ఈ సందర్భంగా సిరి సూపర్ 66 పరిశోధిత వరి విత్తనం ప్రత్యేకతలను నిర్వాహకులు వివరించారు. అధిక దిగుబడి, మెరుగైన గింజ నాణ్యత, బలమైన మొక్క నిర్మాణం ఈ రకానికి ముఖ్య లక్షణాలుగా పేర్కొన్నారు. అదనంగా, ఈ విత్తనం BLB (బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్), నెక్ బ్లాస్ట్ వంటి వ్యాధులను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉందని తెలిపారు.

కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ ఏరియా మేనేజర్ బెజుగామ ఆంజనేయులు మాట్లాడుతూ, ఈ వరి రకం ఖరీఫ్, రబీ రెండు సీజన్లకు అనుకూలమని పేర్కొన్నారు. పంట కాలం సుమారు 120–125 రోజులు ఉండగా, ఎకరానికి 35–40 క్వింటల వరకు దిగుబడి పొందే అవకాశముందని వివరించారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK

Next Story