రూ.15 వేల SIPతో 15 ఏళ్లలో కోటి దాటిన సంపద.. ఈ 10 మ్యూచువల్ ఫండ్స్ ఏంటో తెలుసా?
రూ.15 వేల నెలవారీ SIPతో 15 ఏళ్లలో కోటి దాటిన టాప్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్, గత రాబడుల వివరాలు తెలుసుకోండి.
Top 10 Mutual Funds
మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేవారికి కాంపౌండింగ్ ప్రభావం కీలకంగా ఉంటుంది. ప్రతి నెలా క్రమం తప్పకుండా కొంత మొత్తాన్ని SIP రూపంలో ఇన్వెస్ట్ చేస్తే.. దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో సంపద సమకూరే అవకాశం ఉంటుంది. అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో మార్కెట్ రిస్క్ ఉంటుందని గుర్తుంచుకోవాలి.
ప్రస్తుతం రూ.15 వేల నెలవారీ SIP పెట్టుబడితో 15 ఏళ్ల కాలంలో కోటి రూపాయలకు పైగా విలువను అందించిన కొన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకాలు ఉన్నాయి. ఏస్ మ్యూచువల్ ఫండ్ డేటా ఆధారంగా 138 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను పరిశీలించగా.. 30 పథకాలలో రూ.15 వేల నెలవారీ SIP విలువ 15 ఏళ్ల తర్వాత రూ.1 కోటి దాటినట్లు సమాచారం.
15 ఏళ్లలో రూ.1.74 కోట్లు
ఈ జాబితాలో Nippon India Mutual Fundకు చెందిన నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ ముందుంది. ఇందులో ప్రతి నెలా రూ.15 వేల చొప్పున 15 ఏళ్ల పాటు SIP చేసినట్లయితే.. మొత్తం పెట్టుబడి రూ.27 లక్షలు అవుతుంది. గత పనితీరు ఆధారంగా ఈ మొత్తం సుమారు రూ.1.74 కోట్లకు చేరినట్లు సమాచారం.
ఆ తర్వాత ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ రూ.1.44 కోట్లతో రెండో స్థానంలో ఉంది. డీఎస్పీ స్మాల్ క్యాప్ ఫండ్‌లో ఇదే SIP విలువ సుమారు రూ.1.43 కోట్లకు చేరినట్లు డేటా సూచిస్తోంది.
టాప్-10 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్
నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ – రూ.1.74 కోట్లు
ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ – రూ.1.44 కోట్లు
డీఎస్పీ స్మాల్ క్యాప్ ఫండ్ – రూ.1.43 కోట్లు
ఎడెల్‌వీస్ మిడ్ క్యాప్ ఫండ్ – రూ.1.36 కోట్లు
ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ – రూ.1.35 కోట్లు
క్వాంట్ ఈఎల్ఎస్ఎస్ టాక్స్ సేవర్ ఫండ్ – రూ.1.34 కోట్లు
క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ – రూ.1.33 కోట్లు
హెచ్‌డీఎఫ్‌సీ మిడ్ క్యాప్ ఫండ్ – రూ.1.29 కోట్లు
కోటక్ మిడ్ క్యాప్ ఫండ్ – రూ.1.28 కోట్లు
హెచ్ఎస్‌బీసీ మిడ్ క్యాప్ ఫండ్ – రూ.1.26 కోట్లు
రూ.27 లక్షల పెట్టుబడి.. కోటికి పైగా విలువ
రూ.15 వేల చొప్పున ప్రతి నెలా 15 ఏళ్ల పాటు SIP చేస్తే మొత్తం రూ.27 లక్షలు పెట్టుబడి అవుతుంది. పై పథకాల గత రాబడుల ఆధారంగా కొన్ని ఫండ్స్‌లో ఈ పెట్టుబడి విలువ రూ.1 కోటి దాటినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. దీర్ఘకాలంలో క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టడం, కాంపౌండింగ్ ప్రయోజనం పొందడం ద్వారా సంపదను పెంచుకునే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే గతంలో వచ్చిన రాబడులు భవిష్యత్తులోనూ కొనసాగుతాయని హామీ లేదు. మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్‌కు అనుసంధానమై ఉంటాయి కాబట్టి రాబడుల్లో హెచ్చుతగ్గులు ఉండొచ్చు. ముఖ్యంగా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఫండ్స్‌లో రిస్క్ స్థాయిని అర్థం చేసుకుని పెట్టుబడి నిర్ణయం తీసుకోవాలి. పెట్టుబడి పెట్టే ముందు పథకం లక్ష్యాలు, రిస్క్, ఖర్చులు, గత పనితీరు వంటి అంశాలను పరిశీలించడం మంచిది.




