Motor Insurance: వాహనదారులకు బిగ్ అలర్ట్.. డిసెంబర్ 15 నుండి మారనున్న కారు, బైక్ ఇన్సూరెన్స్ రూల్స్!
Motor Insurance: 2026 డిసెంబర్ 15 నుండి IRDAI కొత్త 4-అంచెల మోటార్ ఇన్సూరెన్స్ రూల్స్ అమల్లోకి రానున్నాయి.
Motor Insurance: వాహనదారులకు బిగ్ అలర్ట్.. డిసెంబర్ 15 నుండి మారనున్న కారు, బైక్ ఇన్సూరెన్స్ రూల్స్!
IRDAI New Motor Insurance Rules 2026: కారు లేదా బైక్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు అన్నీ కలిపి ఇంత ప్రీమియం అవుతుంది అని ఏజెంట్లు చెబితే మనం గుడ్డిగా డబ్బులు కట్టేస్తుంటాం. అసలు మనం కట్టే డబ్బులో దేనికి ఎంత రక్షణ లభిస్తుందో, ఏ కవరేజీ మనకు నిజంగా అవసరమో స్పష్టంగా తెలిసేది కాదు. కానీ ఇకపై ఆ అయోమయానికి తెరపడనుంది. వాహనదారులకు పూర్తి పారదర్శకతను, ఆర్థిక వెసులుబాటును కల్పిస్తూ భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ మోటార్ ఇన్సూరెన్స్ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. 2026, డిసెంబర్ 15 నుండి దేశవ్యాప్తంగా సరికొత్త నాలుగు-అంచెల మోటార్ ఇన్సూరెన్స్ విధానం అమల్లోకి రాబోతోంది.
ఇకపై మీ వాహన బీమా పాలసీ నాలుగు స్పష్టమైన విభాగాలుగా విభజించబడుతుంది. దీనివల్ల మీ అవసరానికి తగిన కవరేజీని మాత్రమే ఎంచుకుని, అనవసరపు ప్రీమియం భారాన్ని తగ్గించుకోవచ్చు. ఇది చట్టప్రకారం ప్రతి వాహనానికి ఉండాల్సిన ప్రాథమిక బీమా. ప్రమాదవశాత్తు మీ వాహనం వల్ల ఎదుటివారికి జరిగే నష్టాన్ని ఇది భర్తీ చేస్తుంది. ఇది మీ వాహనానికి గానీ, అందులో ప్రయాణించే మీకు గానీ ఎలాంటి రక్షణ ఇవ్వదు.
కారులో ప్రయాణించే ఇతరులు, బైక్ వెనుక కూర్చునేవారు ప్రమాదంలో గాయపడి, వాహన యజమానిపై చట్టపరమైన క్లెయిమ్‌లు వేస్తే ఈ కవర్ మిమ్మల్ని రక్షిస్తుంది. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన మెలిక ఉంది. ఈ కవర్లో వాహన యజమానితో పాటు వారి జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులకు వర్తింపు ఉండదు.
ఇందులో వాహన యజమానికి వ్యక్తిగత ప్రమాద బీమా తప్పనిసరి. అయితే, కారులో ప్రయాణించే ఇతర ప్రయాణికులు, బైక్ పిలియన్ రైడర్లకు ఇది ఆప్షనల్. కుటుంబంతో కలిసి కారులో ప్రయాణించే వారు ఈ ఆప్షనల్ కవర్‌ను తప్పనిసరిగా ఎంచుకోవాలి. ఎందుకంటే ప్రమాదంలో భార్య, పిల్లలు, తల్లిదండ్రులకు దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే నేరుగా ఆర్థిక పరిహారం అందించేది ఈ కవర్ మాత్రమే. ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు లేదా దొంగతనం వల్ల మీ సొంత వాహనానికి జరిగే రిపేర్లు లేదా పూర్తి నష్టాన్ని వాహన మార్కెట్ విలువ ఆధారంగా ఇది భర్తీ చేస్తుంది.
చాలామంది వాహనదారులు విభాగం-2 లోని 'ప్రయాణీకుల బాధ్యత కవరేజీ', విభాగం-3 లోని పర్సనల్ యాక్సిడెంట్ కవరేజీ రెండూ ఒకటే అనుకుని పొరపడుతుంటారు. కేవలం ఇతరులు మీపై వేసే చట్టపరమైన కేసుల నుండి మిమ్మల్ని కాపాడే రక్షణ కవచం మాత్రమే. మాత్రమే ప్రమాదంలో గాయపడిన లేదా మరణించిన మీ కుటుంబ సభ్యులకు నేరుగా ఆర్థిక భరోసాను అందిస్తుంది. కాబట్టి పాలసీ తీసుకునేటప్పుడు ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించి, మీ కుటుంబ భద్రత కోసం విభాగం-3 లోని ఆప్షనల్ కవర్‌ను తప్పక జత చేసుకోండి.
మీరు ఇప్పటికే కేవలం థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ మాత్రమే తీసుకుని ఉన్నారా? అయితే ఆ పాలసీని రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదు. మధ్యలో కొంత అదనపు ప్రీమియం చెల్లించి, మీ బీమా సంస్థ నుండి ఎండార్స్మెంట్' పొందడం ద్వారా ప్రయాణీకులు లేదా పిలియన్ రైడర్ల కవర్‌ను ఎప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 15 లోగా ఈ కొత్త విధానాన్ని బీమా సుగమ్ ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానించాలని బీమా సంస్థలను ఐఆర్డీఏఐ ఆదేశించింది. ఇకపై ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో పాలసీ కొనేటప్పుడు కంపెనీలు మీకు రెండు కీలక పత్రాలను తప్పనిసరిగా ఇవ్వాలి:
నాలుగు విభాగాలలో మీరు ఏవేవి ఎంచుకున్నారో స్పష్టంగా తెలిపే పత్రం. ఏ విభాగానికి ఎంత ప్రీమియం వసూలు చేస్తున్నారో విడివిడిగా వివరించే పత్రం. కేవలం తక్కువ ప్రీమియం వస్తోంది కదా అని గుడ్డిగా పాలసీ కొనుగోలు చేయకండి. ప్రమాదం జరిగినప్పుడు మాకు ఈ కవర్ వర్తించదా? అని బాధపడే కంటే, పాలసీపై సంతకం చేసే ముందే ఆప్షన్ ఫారమ్ , సీఐఎస్లను క్షుణ్ణంగా చదవండి. మీకు, మీ కుటుంబానికి పూర్తి రక్షణ ఇచ్చే కవర్లు అందులో ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే ప్రీమియం చెల్లించండి.




