Mutual Funds: ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. ఈ వారం మార్కెట్లోకి 5 సరికొత్త కొత్త స్కీమ్స్!

Mutual Funds: ఇన్వెస్కో, కోటక్, ఐసీఐసీఐ ప్రూడెన్షియల్, యూటీఐ వంటి దిగ్గజ ఫండ్ హౌస్‌లు ఈ వారం 5 సరికొత్త NFOలను లాంచ్ చేస్తున్నాయి.

Gagan kumar
Published on: 26 Oct 2026 7:38 AM IST
Mutual Funds
X

Mutual Funds: ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. ఈ వారం మార్కెట్లోకి 5 సరికొత్త కొత్త స్కీమ్స్!

Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారా..? మీ పోర్ట్‌ఫోలియోను మరింత విభిన్నంగా తీర్చిదిద్దుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. దేశంలోని ప్రముఖ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు ఈ వారం 5 సరికొత్త న్యూ ఫండ్ ఆఫర్ల ను సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.

ఇన్వెస్కో ఇండియా, కోటక్ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రూడెన్షియల్, యూటీఐ వంటి దిగ్గజ ఫండ్ హౌస్‌లు వీటిని లాంచ్ చేస్తున్నాయి. విశేషమేమిటంటే.. ఈ ఐదింటిలో 4 ప్యాసివ్ ఫండ్లు కాగా, 1 యాక్టివ్‌గా నిర్వహించే ఫండ్ ఉంది. ఈ 5 NFOలకు సంబంధించిన పూర్తి వివరాలు, సబ్‌స్క్రిప్షన్ తేదీలు , కనీస పెట్టుబడి పరిమితులు ఇవే.

కోటక్ నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ ఫండ్

కేటగిరీ: ప్యాసివ్ ఇండెక్స్ ఫండ్

సబ్‌స్క్రిప్షన్ తేదీలు: అక్టోబర్ 26 నుండి నవంబర్ 9 వరకు

కనీస పెట్టుబడి: రూ. 1,000

ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ బీఎస్ఈ పవర్ ఈటీఎఫ్

కేటగిరీ: పవర్ & ఎనర్జీ రంగానికి చెందిన సెక్టోరల్ ETF

సబ్‌స్క్రిప్షన్ తేదీలు: అక్టోబర్ 26 నుండి అక్టోబర్ 30 వరకు

కనీస పెట్టుబడి: రూ. 1,000

ఇన్వెస్కో ఇండియా సిల్వర్ ఈటీఎఫ్

కేటగిరీ: ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్

సబ్‌స్క్రిప్షన్ తేదీలు: అక్టోబర్ 27, 2026 నుండి నవంబర్ 9 వరకు

కనీస పెట్టుబడి: రూ. 5,000

ఇన్వెస్కో ఇండియా సిల్వర్ ఈటీఎఫ్ FOF

కేటగిరీ: ఫండ్ ఆఫ్ ఫండ్స్

సబ్‌స్క్రిప్షన్ తేదీలు: అక్టోబర్ 27 నుండి నవంబర్ 9 వరకు

కనీస పెట్టుబడి: రూ. 1,000

యూటీఐ ఫైనాన్షియల్ సర్వీసెస్ డెట్ ఫండ్

కేటగిరీ: యాక్టివ్‌గా నిర్వహించే డెట్ ఫండ్

సబ్‌స్క్రిప్షన్ తేదీలు: అక్టోబర్ 27, 2026 నుండి నవంబర్ 2, 2026 వరకు

కనీస పెట్టుబడి: రూ. 500

గమనిక మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. ఇన్వెస్ట్ చేసే ముందు సంబంధిత ఫండ్ డాక్యుమెంట్లను నిశితంగా పరిశీలించడం మంచిది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.