Mutual Fund: మ్యూచువల్ ఫండ్స్‌లో మరో 6 కొత్త స్కీమ్స్!

Mutual Fund: ఇన్వెస్కో, ఎడెల్వేయిస్, క్వాంట్, కోటక్, ఆదిత్య బిర్లా మ్యూచువల్ ఫండ్స్ నుంచి 6 కొత్త ఎన్‌ఎఫ్‌ఓలు మార్కెట్లోకి వచ్చాయి.

Gagan kumar
Published on: 6 Nov 2026 8:21 AM IST
Mutual Fund
X

Mutual Fund: మ్యూచువల్ ఫండ్స్‌లో మరో 6 కొత్త స్కీమ్స్!

New mutual fund: భారతీయ స్టాక్ మార్కెట్లలో రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం రోజురోజుకూ గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు సరికొత్త పెట్టుబడి మార్గాలను అందిస్తున్నాయి. తమ పోర్ట్‌ఫోలియోను విస్తరించుకోవాలనుకునే ఇన్వెస్టర్ల కోసం ఈ వారం 6 కొత్త మ్యూచువల్ ఫండ్ ఆఫర్లు సబ్‌స్క్రిప్షన్ కోసం మార్కెట్లోకి వచ్చాయి. ప్రారంభంలో రూ. 10 ఎన్ఏవీతో లభించే ఈ ఫండ్లలో కొన్నింటి సబ్‌స్క్రిప్షన్ నవంబర్ 6తో ముగుస్తుండగా, మరికొన్ని నవంబర్ 9, నవంబర్ 13, నవంబర్ 17 వరకు అందుబాటులో ఉండనున్నాయి. కోటక్, ఇన్వెస్కో, ఎడెల్వేయిస్ వంటి దిగ్గజ సంస్థలు తీసుకువచ్చిన ఈ 6 కొత్త ఫండ్ల సమగ్ర వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

ఇన్వెస్కో ఇండియా సిల్వర్ ఈటీఎఫ్

ఇన్వెస్కో ఇండియా మ్యూచువల్ ఫండ్ సంస్థ వెండి ఆధారిత ఈటీఎఫ్ కేటగిరీలో ఈ ఫండ్‌ను లాంచ్ చేసింది. వెండి ధరల కదలికలను ఈ ఫండ్ ట్రాక్ చేస్తుంది. దీని సబ్‌స్క్రిప్షన్ నవంబర్ 9వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో పెట్టుబడి ప్రారంభించాలనుకునే వారు కనీసం రూ. 5000తో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.

ఇన్వెస్కో ఇండియా సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్

నేరుగా ఈటీఎఫ్ ఖాతా లేని ఇన్వెస్టర్ల కోసం ఇన్వెస్కో సంస్థ ఈ ఫండ్ ఆఫ్ ఫండ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది పైన పేర్కొన్న సిల్వర్ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. దీని సబ్‌స్క్రిప్షన్ కూడా నవంబర్ 9వ తేదీ వరకు ఓపెన్‌గా ఉంటుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ. 1000 నుంచి ప్రారంభమవుతుంది.

ఎడెల్వేయిస్ నిఫ్టీ ఎనర్జీ ఈటీఎఫ్

ఎడెల్వేయిస్ మ్యూచువల్ ఫండ్ నుంచి లాంచ్ అయిన ఈ ఫండ్ డొమెస్టిక్ ఎనర్జీ రంగానికి సంబంధించిన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. నిఫ్టీ ఎనర్జీ ఇండెక్స్ పనితీరును ఇది ట్రాక్ చేస్తుంది. ఈ ఎన్‌ఎఫ్‌ఓ నవంబర్ 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో కనీస పెట్టుబడిని రూ. 5000గా నిర్ణయించారు.

క్వాంట్ సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్

ఇటీవల కాలంలో వేగంగా వృద్ధి చెందుతున్న క్వాంట్ మ్యూచువల్ ఫండ్ సంస్థ వెండి విభాగానికి సంబంధించిన ఈ ఫండ్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ ఎన్‌ఎఫ్‌ఓ సబ్‌స్క్రిప్షన్ నవంబర్ 6వ తేదీతో ముగియనుంది. ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి కనీస అమౌంట్ రూ. 5000గా ఉంది.

కోటక్ నిఫ్టీ ఆల్ఫా లో వొలాటిలిటీ 30 ఇండెక్స్ ఫండ్

కోటక్ మ్యూచువల్ ఫండ్ సంస్థ ఫ్యాక్టర్ ఆధారిత ఇండెక్స్ ఫండ్‌ను ప్రవేశపెట్టింది. అత్యధిక రాబడులు (ఆల్ఫా) ఇస్తూనే, తక్కువ హెచ్చుతగ్గులు (లో వొలాటిలిటీ) ఉండే 30 ఎంపిక చేసిన కంపెనీల పనితీరు ఆధారంగా ఈ ఫండ్ పనిచేస్తుంది. విపరీతమైన మార్కెట్ రిస్క్ తీసుకోకుండా స్థిరమైన రాబడులు కోరుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది.

ఆదిత్య బిర్లా ఎస్ఎల్ ఎఫ్‌ఎమ్‌పీ వీసీ 114డీ

ఆదిత్య బిర్లా సుదర్శన్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ డెట్ కేటగిరీలో ఈ ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. నిర్ణీత కాల వ్యవధితో వచ్చే ఈ డెట్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ నవంబర్ 17వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ ఫండ్‌లో కనీస పెట్టుబడి రూ. 1000గా నిర్ణయించారు.

కొత్తగా వచ్చే ఎన్‌ఎఫ్‌ఓలలో రూ. 10 ఆకర్షణీయమైన ఎన్ఏవీకి లభించినప్పటికీ, అవి కేవలం పథకం ప్రారంభ ధరకు సూచిక మాత్రమే. ఇన్వెస్ట్ చేసే ముందు ఆయా ఫండ్ల పెట్టుబడి లక్ష్యాలు, రిస్క్ ప్రొఫైల్, కేటగిరీ , సబ్‌స్క్రిప్షన్ ముగిసే తేదీలను సరి చూసుకోవడం మంచిది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.