Parenting Tips: పిల్ల‌ల‌కు చిన్న‌ప్ప‌టి నుంచే ఈ పొదుపు సూత్రాలు నేర్పించండి.. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు రావు

పిల్లలకు చిన్న‌నాటి నుంచే డబ్బు విలువ, పొదుపు ప్రాముఖ్యతను కూడా తెలియజేయాలి. చిన్నప్పటి నుంచే డబ్బును ఎలా ఖర్చు చేయాలి? ఎలా ఆదా చేయాలి? ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? అనే విషయాలు నేర్పిస్తే భవిష్యత్తులో వారు ఆర్థికంగా స్వతంత్రంగా ఎదిగే అవకాశం ఉంటుంది.

Mokshith
Published on: 15 Nov 2026 3:42 PM IST
Parenting Tips
X

Parenting Tips: పిల్ల‌ల‌కు చిన్న‌ప్ప‌టి నుంచే ఈ పొదుపు సూత్రాలు నేర్పించండి.. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు రావు

Parenting Tips: పిల్లలకు చిన్న‌నాటి నుంచే డబ్బు విలువ, పొదుపు ప్రాముఖ్యతను కూడా తెలియజేయాలి. చిన్నప్పటి నుంచే డబ్బును ఎలా ఖర్చు చేయాలి? ఎలా ఆదా చేయాలి? ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? అనే విషయాలు నేర్పిస్తే భవిష్యత్తులో వారు ఆర్థికంగా స్వతంత్రంగా ఎదిగే అవకాశం ఉంటుంది. నిపుణుల సూచనల ప్రకారం పిల్లల్లో ఆర్థిక క్రమశిక్షణ పెంచేందుకు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు తెలుసుకుందాం.

చిన్న వయసు నుంచే పొదుపు అలవాటు చేయాలి

పిల్లలకు డబ్బు విలువను చిన్నప్పటి నుంచే తెలియజేయాలి. వారికి ఇచ్చే పాకెట్ మనీలో కొంత మొత్తాన్ని ఖర్చులకు, మరికొంత మొత్తాన్ని పొదుపు కోసం కేటాయించేలా అలవాటు చేయాలి. డబ్బును ఎంత త్వరగా పొదుపు చేయడం ప్రారంభిస్తే భవిష్యత్తులో అంత ఎక్కువ ప్రయోజనం ఉంటుందని వివరించాలి. ముఖ్యంగా చక్రవడ్డీ వల్ల దీర్ఘకాలంలో పెట్టుబడులు ఎలా పెరుగుతాయో ఉదాహరణలతో చెప్పాలి.

ఆదాయం పెరిగే కొద్దీ పొదుపు కూడా పెంచాలి

పిల్లలకు భవిష్యత్తులో ఉద్యోగం వచ్చినప్పుడు లేదా ఆదాయం పెరిగినప్పుడు ఖర్చులు మాత్రమే పెంచుకోకూడదని నేర్పించాలి. ఆదాయంలో కొంత భాగాన్ని తప్పనిసరిగా పొదుపు, పెట్టుబడుల కోసం కేటాయించాలి. ప్రతి సంవత్సరం తమ ఆర్థిక పరిస్థితిని బట్టి పెట్టుబడి మొత్తాన్ని 5 నుంచి 10 శాతం వరకు పెంచుకోవడం మంచి అలవాటు. ఇలా చేయడం వల్ల కాలక్రమేణా మంచి ఆర్థిక భద్రత ఏర్పడుతుంది.

లక్ష్యంతో పొదుపు చేయాలి..

ఏదో ఒకటి కొనాలనే ఉద్దేశంతో కాకుండా ఒక నిర్దిష్ట లక్ష్యంతో పొదుపు చేయడం నేర్పించాలి. ఉన్నత చదువులు, ఇల్లు కొనుగోలు, భవిష్యత్తు అవసరాల కోసం ముందుగానే ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవాలి. అలాగే సోషల్ మీడియాలో వచ్చే ప్రతి పెట్టుబడి సలహాను నమ్మకూడదని పిల్లలకు వివరించాలి. పెట్టుబడి పెట్టే ముందు పూర్తి వివరాలు తెలుసుకుని, నమ్మకమైన వనరుల ద్వారా వాటిని పరిశీలించాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న AI సాధనాలు మ్యూచువల్ ఫండ్స్, పెట్టుబడి పథకాల వివరాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అయితే వాటిపై పూర్తిగా ఆధారపడకుండా, తమ ఆదాయం, బాధ్యతలు, రిస్క్ సామర్థ్యాన్ని బట్టి తుది నిర్ణయం తీసుకోవాలని నేర్పించాలి.

మొత్తంగా.. పిల్లలకు చదువుతో పాటు డబ్బు నిర్వహణపై అవగాహన కల్పించడం కూడా తల్లిదండ్రుల బాధ్యత. చిన్నప్పటి నుంచే పొదుపు, పెట్టుబడి, ఖర్చుల నియంత్రణ వంటి అలవాట్లు నేర్పిస్తే వారు భవిష్యత్తులో ఆర్థికంగా మెరుగైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.