Recharge Plan: అన్‌లిమిటెడ్ కాల్స్‌, 18కిపైగా ఓటీటీలు.. అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్

Recharge Plan: తక్కువ ఖర్చుతో ఎక్కువ డేటా, 5G సేవలు, OTT వినోదం కోరుకునే వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎయిర్‌టెల్ కొత్త డేటా వోచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Mokshith
Published on: 12 July 2026 2:47 PM IST
Recharge Plan
X

 Recharge Plan: అన్‌లిమిటెడ్ కాల్స్‌, 18కిపైగా ఓటీటీలు.. అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్

Recharge Plan: తక్కువ ఖర్చుతో ఎక్కువ డేటా, 5G సేవలు, OTT వినోదం కోరుకునే వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎయిర్‌టెల్ కొత్త డేటా వోచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం రూ.200తో లభించే ఈ ప్లాన్‌లో 30GB హైస్పీడ్ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ 5G, ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌ల సబ్‌స్క్రిప్షన్లు కూడా లభిస్తున్నాయి.

రూ.200 ప్లాన్‌లో లభించే ప్రయోజనాలు

ఎయిర్‌టెల్ తీసుకొచ్చిన ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో ఉంటుంది. అయితే ఇది సాధారణ రీఛార్జ్ ప్లాన్ కాదు. ఇది ఒక డేటా వోచర్. అంటే ఈ ప్లాన్‌ను ఉపయోగించాలంటే మీ మొబైల్ నంబర్‌పై ఇప్పటికే యాక్టివ్‌గా ఉన్న బేస్ రీఛార్జ్ ప్లాన్ తప్పనిసరిగా ఉండాలి. ఈ ప్లాన్ ద్వారా 28 రోజుల పాటు మొత్తం 30GB హైస్పీడ్ డేటాను ఉప‌యోగించుకోవ‌చ్చు. ఎక్కువ డేటా అవసరమయ్యే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

అన్‌లిమిటెడ్ 5G, OTT సబ్‌స్క్రిప్షన్లు ప్రత్యేక ఆకర్షణ

ఈ ప్లాన్‌లో ప్రధాన హైలైట్ అన్‌లిమిటెడ్ 5G సేవ. అయితే ఈ సదుపాయం పొందాలంటే యూజ‌ర్‌ వద్ద 5G స్మార్ట్‌ఫోన్ ఉండాలి. అలాగే ఎయిర్‌టెల్ 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతంలో ఉండాలి. డేటాతో పాటు వినోదాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ప్లాన్‌లో 28 రోజుల పాటు జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నారు. అంతేకాదు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్ కూడా లభిస్తుంది. దీని ద్వారా సోనీలివ్‌, ల‌య‌న్‌స్టేజ్ ప్లే సహా 18కిపైగా ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లలోని కంటెంట్‌ను అదనపు చార్జీలు లేకుండా వీక్షించే అవకాశం ఉంటుంది.

30GB డేటా పూర్తయితే ఏమవుతుంది?

ఈ ప్లాన్‌లో ఇచ్చే 30GB హైస్పీడ్ డేటా పూర్తయిన తర్వాత కూడా ఇంటర్నెట్‌ను ఉపయోగించే అవకాశం ఉంటుంది. అయితే ఆ తర్వాత వినియోగించే ప్రతి 1MB డేటాకు 50 పైసల చొప్పున అదనపు ఛార్జీ విధిస్తారు. అందువల్ల ఎక్కువ డేటా ఉపయోగించే వారు 30GB పరిమితిని గుర్తుంచుకుని అవసరమైతే మరో డేటా వోచర్‌ను రీఛార్జ్ చేసుకోవడం మంచిది.

జియో, వీఐ ప్లాన్‌లతో పోలిస్తే ఎలా ఉంది?

జియో కూడా దాదాపు ఇదే ధరలో 28 రోజుల డేటా వోచర్‌ను అందిస్తోంది. అందులో కూడా 30GB డేటా, అన్‌లిమిటెడ్ 5G వంటి ప్రయోజనాలు ఉన్నాయి. అయితే OTT సబ్‌స్క్రిప్షన్ల పరంగా చూస్తే ఎయిర్‌టెల్ కొంత ముందంజలో కనిపిస్తోంది. జియో ప్లాన్‌లో సుమారు 16 OTT యాప్‌ల యాక్సెస్ లభిస్తే, ఎయిర్‌టెల్ ప్లాన్‌లో 18కిపైగా OTT ప్లాట్‌ఫారమ్‌లతో పాటు ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం సభ్యత్వం కూడా లభిస్తోంది. మరోవైపు Vi రూ.199 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్, 2GB డేటా, 300 SMSలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. 5G సేవలు లేదా OTT ప్రయోజనాలు అందులో ఉండవు.

ఎవరికి ఈ ప్లాన్ సరైన ఎంపిక?

మొబైల్‌లో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఎక్కువగా చూసే వారు, 5G నెట్‌వర్క్‌ను విస్తృతంగా వినియోగించే వారు, తక్కువ ధరలో అదనపు డేటా కావాలనుకునే వారికి ఈ ఎయిర్‌టెల్ ప్లాన్ మంచి ఎంపికగా చెప్పవచ్చు. అయితే ఇది యాడ్-ఆన్ ప్లాన్ కాబట్టి, ముందుగా మీ నంబర్‌పై యాక్టివ్ బేస్ ప్లాన్ ఉండటం తప్పనిసరి. మీ వినియోగాన్ని బట్టి ఈ ప్లాన్ మీకు అదనపు ప్రయోజనాలను అందించగలదు.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story