Airtel: గుడ్‌న్యూస్‌.. ఎయిర్‌టెల్‌ నుంచి 3 కొత్త ప్లాన్లు.. అలాంటి వారికి మస్త్ బెనిఫిట్స్..!

Airtel: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ (Airtel) మూడు కొత్త ప్రీపెయిడ్‌ రీఛార్జి ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Venkat
Published on: 18 Oct 2026 5:29 PM IST
Airtel
X

Airtel: గుడ్‌న్యూస్‌.. ఎయిర్‌టెల్‌ నుంచి 3 కొత్త ప్లాన్లు.. అలాంటి వారికి మస్త్ బెనిఫిట్స్..!

Airtel Launches 3 New Voice-Only Recharge Plans: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ (Airtel) మూడు కొత్త ప్రీపెయిడ్‌ రీఛార్జి ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం వాయిస్‌ కాల్స్‌, ఎస్సెమ్మెస్‌ ప్రయోజనాలు మాత్రమే కోరుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ ప్లాన్లను తీసుకొచ్చింది. రూ.185, రూ.203, రూ.206 ధరలతో ఇవి అందుబాటులో ఉన్నాయి.

ట్రాయ్‌ (TRAI) మార్గదర్శకాల ప్రకారం టెలికాం సంస్థలు డేటా అవసరం లేని వినియోగదారుల కోసం ప్రత్యేకంగా వాయిస్‌, ఎస్సెమ్మెస్‌ ప్లాన్లను అందించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్‌ కొత్త రీఛార్జి ఆప్షన్లను ప్రకటించింది. ట్రాయ్‌ ఇచ్చిన గడువు అక్టోబర్‌ 21తో ముగియనుంది.

రూ.185 ప్లాన్‌..

రూ.185 ప్లాన్‌ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో అపరిమిత లోకల్‌, ఎస్టీడీ, రోమింగ్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. దీంతో పాటు 300 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి.

రూ.203 ప్లాన్‌..

రూ.203 రీఛార్జి ప్లాన్‌ 30 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో ఉంటుంది. రూ.185 ప్లాన్‌లో ఉన్నట్టే ఇందులోనూ అపరిమిత లోకల్‌, ఎస్టీడీ, రోమింగ్‌ కాల్స్‌తో పాటు 300 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి.

రూ.206 ప్లాన్‌..

రూ.206 ప్లాన్‌లోనూ ఇదే వాయిస్‌, ఎస్సెమ్మెస్‌ ప్రయోజనాలు ఉంటాయి. అయితే దీని ప్రత్యేకత క్యాలెండర్‌ నెల వ్యాలిడిటీ. అంటే రీఛార్జి చేసిన తేదీ నుంచి 30 రోజులు కాకుండా ఆ క్యాలెండర్‌ నెల మొత్తం ఈ ప్యాక్‌ పనిచేస్తుంది. ఆ నెలలో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులకూ వ్యాలిడిటీ వర్తిస్తుంది.

ఎవరికి ఉపయోగం?

ఈ మూడు ప్లాన్లు ఎయిర్‌టెల్‌ అధికారిక వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ ద్వారా రీఛార్జి చేసుకోవచ్చు. వీటిలో మొబైల్‌ డేటా, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు లేదా ఇతర అదనపు ప్రయోజనాలు ఉండవు.

ఫీచర్‌ ఫోన్లు ఉపయోగించే వారికి, మొబైల్‌ డేటా అవసరం లేకపోయినా కాల్స్‌ కోసం ఎక్కువ మొత్తంలో రీఛార్జి చేస్తున్న వారికి ఇవి ఉపయోగపడతాయి. అలాగే ఇంటర్నెట్‌ కోసం ఇంట్లో లేదా కార్యాలయంలో వైఫైని ఉపయోగించే వారికి కూడా ఈ ప్లాన్లు ఉపయోగకరంగా ఉంటాయి. అవసరం లేని డేటా కోసం డబ్బు చెల్లించకుండా, కేవలం కాల్స్‌, ఎస్సెమ్మెస్‌లకు సరిపడే ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.