Airtel: ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ యూజర్లకు షాక్.. రూ.50 చొప్పున పెరిగిన ప్లాన్ ధరలు!
Airtel: ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ధరలను రూ.50 పెంచగా, అక్టోబర్ 8 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి.
Airtel: ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ యూజర్లకు షాక్.. రూ.50 చొప్పున పెరిగిన ప్లాన్ ధరలు!ప్రముఖ ప్రైవేట్ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు గట్టి షాకిచ్చింది. వివిధ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలను రూ. 50 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెరిగిన కొత్త ధరలు అక్టోబర్ 8 నుంచి అమల్లోకి రానున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే ధరల పెంపుతో పాటు యూజర్లకు ఊరటనిచ్చేలా ఇంటర్నేషనల్ రోమింగ్ సదుపాయాన్ని ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది.
సవరించిన ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల వివరాలు:
ఎయిర్‌టెల్ వ్యక్తిగత పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు ఇకపై రూ.499 నుంచి ప్రారంభం కానున్నాయి.
ఫ్యామిలీ ప్లాన్‌ల ధరలు:
ఇద్దరు సభ్యులకు: రూ. 749
ముగ్గురు సభ్యులకు: రూ. 1,049
నలుగురు సభ్యులకు: రూ. 1,249 మరియు రూ. 1,449
ఐదుగురు కుటుంబ సభ్యులు ఉన్నవారికి: రూ. 1,799 చెల్లించాల్సి ఉంటుంది.
ఉచిత ఇంటర్నేషనల్ రోమింగ్ ప్రయోజనాలు:
పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ కలిగిన కస్టమర్లందరూ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చని ఎయిర్‌టెల్ తెలిపింది. ఈ కాంప్లిమెంటరీ ప్లాన్ ద్వారా 5 జీబీ డేటా, 60 నిమిషాల కాలింగ్, 25 ఎస్సెమ్మెస్‌లు 5 రోజుల పాటు ఉచితంగా లభిస్తాయని పేర్కొంది. ఇప్పటికే ఫాస్ట్‌లేన్ టెక్నాలజీ (నెట్‌వర్క్ స్లైసింగ్), అపరిమిత డేటా, స్పామ్ ప్రొటెక్షన్ వంటి సేవలు అందిస్తుండగా.. తాజాగా ఇంటర్నేషనల్ రోమింగ్ కూడా జతైందని భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ అమిత్ త్రిపాఠి తెలిపారు. వొడాఫోన్ ఐడియా (Vi) ఇంటర్నేషనల్ రోమింగ్ సేవలను ఉచితంగా ప్రకటన చేసిన కొద్దిరోజులకే ఎయిర్‌టెల్ కూడా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.




