వాహనదారులకు అలెర్ట్.. కొత్త నిబంధనలు వచ్చేస్తున్నాయ్.. జాగ్రత్త!

PUCC renewal rules: పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ రెన్యువల్ నిబంధనల్లో వాహనాల మోడల్ (BS-6, BS-4) ఆధారంగా పలు కీలక మార్పులు చేస్తూ కొత్త రూల్స్ తీసుకురాబోతోంది.

Ravi
By Ravi
Published on: 24 Jun 2026 3:11 PM IST
PUCC renewal rules
X

వాహనదారులకు అలెర్ట్.. కొత్త నిబంధనలు వచ్చేస్తున్నాయ్.. జాగ్రత్త!

PUCC renewal rules: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో ఒక ముఖ్యమైన అలెర్ట్ జారీ చేయనుంది. వాహనాల వల్ల పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు వాహనదారుల సౌలభ్యం కోసం పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ (PUCC) రెన్యువల్ నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు తీసుకురాబోతోంది. కొత్తగా రాబోతున్న ఈ నిబంధనల ప్రకారం వాహనం రిజిస్ట్రేషన్ అయిన సంవత్సరం, మోడల్ ఆధారంగా సర్టిఫికెట్ వ్యాలిడిటీని నిర్ణయించనున్నారు.

ఈ కొత్త నిబంధనల ప్రకారం, లేటెస్ట్ మోడల్ అయిన BS-6 ప్రైవేట్ వాహనాలకు భారీ ఊరట లభించనుంది. ఈ వాహనాలు కొనుగోలు చేసిన మొదటి ఆరేళ్ల (6 సంవత్సరాల) వరకూ పొల్యూషన్ సర్టిఫికెట్ (PUCC)ని రెన్యూవల్ చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు.

ఆ తర్వాత అంటే 6 నుంచి 10 ఏళ్ల వయసున్న వాహనాలకు ఏడాదికి ఒక్కసారి రెన్యూవల్ చేయించుకుంటే సరిపోతుంది. అయితే, 10 ఏళ్లకు పైబడి బాగా పాతబడిన వెహికల్స్ మాత్రం కచ్చితంగా ప్రతి 6 నెలలకోసారి ఈ పొల్యూషన్ సర్టిఫికెట్‌ను విధిగా రెన్యూవల్ చేయించుకోవాల్సిందేనని స్పష్టం చేస్తోంది.

ఇక పాత మోడల్ వాహనాల విషయానికొస్తే.. BS-1, BS-3 ప్రైవేట్ వాహనాలకు ప్రతి మూడేళ్లకోసారి ఈ PUCC రెన్యూవల్ చేయించుకోవాలని కొత్త నిబంధనలు సూచిస్తున్నాయి. అలాగే, 2020 మార్చి నెల కంటే ముందు తయారైన BS-4 వెహికల్స్ కి సంబంధించి ప్రతి 6 నెలలకోసారి PUCC ని తప్పనిసరిగా పునరుద్ధరించుకోవాలి.

ఈ కొత్త నిబంధనలు అధికారికంగా అమల్లోకి వస్తే కొత్త వాహనదారులకు పదేపదే కాలుష్య నియంత్రణ కేంద్రాల చుట్టూ తిరిగే బాధ తప్పుతుందని నిపుణులు భావిస్తున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story