Amazon Sale: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ వచ్చేస్తోంది.. డిస్కౌంట్లు, ఆఫర్ల వివరాలు ఇవే

Amazon Sale: దేశవ్యాప్తంగా ఉన్న షాపింగ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తేదీలను అధికారికంగా ప్రకటించింది.

CR Reddy
Published on: 21 Sept 2026 10:28 AM IST
Amazon Sale
X

Amazon Sale

Amazon Sale: దేశవ్యాప్తంగా ఉన్న షాపింగ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తేదీలను అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది ఈ భారీ సేల్ అక్టోబర్ 8వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ తన సేల్ తేదీలను ప్రకటించిన తరుణంలోనే అమెజాన్ కూడా ముందుకు వచ్చి తన సేల్ డేట్లను వెల్లడించింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్ట్స్, హోమ్ అప్లయన్సెస్, గ్రాసరీ వంటి ప్రతి కేటగిరీపై భారీ ఎత్తున డిస్కౌంట్లు లభించనున్నాయి.

బ్యాంక్ ఆఫర్లు, ప్రైమ్ మెంబర్లకు స్పెషల్ డిస్కౌంట్లు

ఈ సేల్ సమయంలో కస్టమర్లు మరింత ఎక్కువగా ఆదా చేసుకునేందుకు వీలుగా అమెజాన్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులు అలాగే ఈఎంఐ ట్రాన్సాక్షన్ల ద్వారా కొనుగోలు చేసే వారికి నేరుగా 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు అదనంగా మరో 10 శాతం వరకు ఎక్స్‌ట్రా డిస్కౌంట్ వర్తిస్తుంది. బ్లాక్‌బస్టర్ డీల్స్, టాప్ 100 డీల్స్, మెగా డీల్స్, 8PM డీల్స్ వంటి విభిన్న ఆఫర్ల ద్వారా కస్టమర్లు అత్యంత తక్కువ ధరలకే కొత్త ఉత్పత్తులను సొంతం చేసుకోవచ్చు.

అమెజాన్ నౌ ద్వారా నిమిషాల్లో డెలివరీ

ఈ పండగ సీజన్‌లో కస్టమర్లకు మరింత వేగవంతమైన సేవలను అందించేందుకు అమెజాన్ ‘అమెజాన్ నౌ’ సర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా కస్టమర్లు తాజా పండ్లు, కూరగాయలు, ఫ్రోజెన్ ఫుడ్స్, డ్రింక్స్, పర్సనల్ కేర్ ఉత్పత్తులు వంటి నిత్యవసరాలను కేవలం నిమిషాల వ్యవధిలోనే చాలా వేగంగా డెలివరీ పొందవచ్చు. ప్రస్తుతం ఈ సేవ దేశవ్యాప్తంగా దాదాపు 60కి పైగా నగరాల్లో అందుబాటులో ఉండగా, దీపావళి నాటికి సుమారు 100 నగరాలకు విస్తరించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

ఉపాధి కల్పన, స్ట్రాంగ్ లాజిస్టిక్స్ నెట్‌వర్క్

ఈ పండగ సీజన్ డిమాండ్‌ను తట్టుకునేలా అమెజాన్ తన ఆపరేషన్ నెట్‌వర్క్‌ను మరింత విస్తృతం చేసింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో లక్షలాది మందికి సీజనల్ ఉద్యోగ అవకాశాలను కల్పించింది. మెట్రో నగరాలతో పాటు టైర్-2, టైర్-3 వంటి చిన్న పట్టణాలకు కూడా సరుకులను వేగంగా చేరవేయడానికి కొత్తగా ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు, సార్ట్ సెంటర్లు, లాస్ట్-మైల్ డెలివరీ స్టేషన్లను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది సెల్లర్లకు ఈ సేల్ ద్వారా భారీ వ్యాపార అవకాశాలు లభించనున్నాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.