అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్.. ఈ ఫోన్‌లపై భారీ తగ్గింపులు..!

Amazon Great Indian Festival: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమజాన్ తన ప్రతిష్టాత్మకమైన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను త్వరలో ప్రారంభించనుంది.

Venkat
Updated on: 7 Oct 2026 9:31 PM IST
Amazon Great Indian Festival
X

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్.. ఈ ఫోన్‌లపై భారీ తగ్గింపులు..!

Amazon Great Indian Festival: అమెజాన్ నిర్వహించే అతిపెద్ద పండుగ సేల్ ఈవెంట్ అయిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ రేపటి నుంచే ప్రారంభం కానుంది. ఈ సేల్ సందర్భంగా వివిధ ధరల శ్రేణిలో లభించే స్మార్ట్‌ఫోన్‌లపై ప్రత్యేక తగ్గింపులు, బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, నో-కాస్ట్ ఈఎంఐ ప్రయోజనాలను వినియోగదారులు పొందవచ్చు. పండుగ సీజన్‌లో కొత్త ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం కానుంది. సేల్‌కు ముందే శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా, ఐఫోన్ 16, షియోమి 17, ఐకూ 15ఆర్ వంటి పలు ప్రీమియం మరియు పాపులర్ ఫోన్లపై ఆఫర్లను అమెజాన్ ప్రకటించింది.

శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా ఫ్లాగ్‌షిప్ ఫోన్ కూపన్ ఆఫర్‌తో సహా రూ. 84,999 ప్రారంభ ఎఫెక్టివ్ ధరకు లభించనుంది. దీనికి గరిష్టంగా 9 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. కాగా, శామ్‌సంగ్ ఈ ఫోన్‌ను భారత్‌లో రూ. 1,29,999 ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఇక ఐఫోన్ 16 ధర అన్ని ఆఫర్లతో కలిపి రూ. 71,999 గా జాబితా చేసింది.

మధ్యతరహా, ప్రీమియం సెగ్మెంట్లలో వన్‌ప్లస్ నార్డ్ 6 రూ. 42,999 ధరతో లభిస్తుండగా, ఐకూ 15ఆర్ రూ. 46,499 ఎఫెక్టివ్ ధరకు అందుబాటులో ఉంది. షియోమి 17 ధర రూ. 59,999 కి తగ్గింది. అలాగే బడ్జెట్ సెగ్మెంట్‌లో ఐకూ జెడ్11ఎక్స్‌ఏ రూ. 24,999 కి, రెడ్‌మి 15సి 5జి ప్రైమ్ రూ. 15,999 ధరకు లభించనున్నాయి.

వీటితో పాటు గరిష్టంగా రూ. 70,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆదా, నెలకు రూ. 2,944 నుంచి ప్రారంభమయ్యే నో-కాస్ట్ ఈఎంఐ, రూ. 7,500 వరకు కూపన్ తగ్గింపులు లభిస్తాయని అమెజాన్ తెలిపింది. ఎస్బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై 10 శాతం తక్షణ తగ్గింపు కూడా వర్తిస్తుంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.