Amazon: స్మార్ట్‌ఫోన్లు, ఏసీలపై భారీ డిస్కౌంట్లు.. అమెజాన్ సమ్మర్ సేల్ డేట్ ఫిక్స్!
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మే 8 నుంచి ప్రారంభం కానుంది.
Amazon
Amazon Summer Sale: ఎండవేడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సామాన్యులకు ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ చల్లని కబురు అందించింది. ఈ వేసవి కాలాన్ని షాపింగ్ పండగగా మార్చేందుకు అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌ను ప్రకటించింది. మే 8వ తేదీ నుంచి ఈ భారీ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. అయితే అమెజాన్ ప్రైమ్ సభ్యులు మాత్రం ఒక రోజు ముందుగానే అంటే మే 7వ తేదీ నుంచే ఈ అద్భుతమైన ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు.
ఈ సేల్‌లో కొనుగోలుదారులు తమకు ఇష్టమైన వస్తువులపై భారీగా డబ్బు ఆదా చేసుకునేందుకు అమెజాన్ అనేక వెసులుబాట్లు కల్పించింది. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులు ఉపయోగించే వారికి పది శాతం వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. దీనితో పాటు అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు వాడుతున్న వారికి ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులను కొనాలనుకునే వారి కోసం ఎక్స్ఛేంజ్ ఆఫర్లు , వడ్డీ లేని సులభ వాయిదాల పద్ధతి వంటి సౌకర్యాలను అమెజాన్ సిద్ధం చేసింది. ఎంపిక చేసిన కొన్ని వస్తువుల మీద ఏకంగా రెండు వేల ఐదు వందల రూపాయల వరకు అదనపు తగ్గింపు పొందే అవకాశం కూడా ఉంది.
టెక్నాలజీ ప్రియుల కోసం ఈ సేల్ ఒక వేడుకలా ఉండబోతోంది. స్మార్ట్‌ఫోన్ల విభాగంలో సాంసంగ్, షియోమి, ఐక్యూ వంటి టాప్ బ్రాండ్ల ఫోన్లపై ఊహించని ధరల తగ్గింపు ఉండనుంది. కేవలం స్మార్ట్‌ఫోన్లే కాకుండా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్ వాచీలు , ఇయర్‌బడ్స్‌పై కళ్లు చెదిరే డీల్స్ ప్రకటించారు. కొత్తగా స్మార్ట్ టీవీలు లేదా ఆడియో సిస్టమ్స్ కొని ఇంటిని హోమ్ థియేటర్‌గా మార్చుకోవాలనుకునే వారికి ఇది సరైన సమయం.
ఎండల తీవ్రత దృష్ట్యా ఎయిర్ కండిషనర్లు , రిఫ్రిజిరేటర్లపై అమెజాన్ ప్రత్యేక దృష్టి సారించింది. వేసవి అవసరాలకు తగ్గట్టుగా ఏసీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు , ఇతర కిచెన్ అప్లయన్సెస్‌పై పరిమిత కాలపు డీల్స్ అందుబాటులో ఉంటాయి. అలాగే ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్ట్స్ ,నిత్యావసర వస్తువులపై కాంబో ఆఫర్ల ద్వారా తక్కువ ధరకే ఎక్కువ వస్తువులను ఇంటికి తెచ్చుకోవచ్చు.
షాపింగ్‌ను మరింత ఉత్సాహంగా మార్చేందుకు అమెజాన్ తన యాప్‌లో స్పిన్ అండ్ విన్ , క్విజ్ వంటి పోటీలను కూడా నిర్వహిస్తోంది. వీటిలో పాల్గొనడం ద్వారా ఖరీదైన గాడ్జెట్లు లేదా షాపింగ్ వోచర్లు గెలుచుకునే అదృష్టం మీ సొంతం కావచ్చు. వేగంగా అమ్ముడయ్యే లైట్నింగ్ డీల్స్ , ప్రత్యేకంగా ఎంపిక చేసిన టాప్ 100 డీల్స్ విభాగాలు ఈ సేల్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. కాబట్టి కొత్త ఫోన్ కొనాలన్నా లేదా ఇంటికి కొత్త ఏసీ తేవాలన్నా మే 8 నుంచి ప్రారంభమయ్యే అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌ను అస్సలు మిస్ అవ్వకండి.




