Amazon Prime Day: అమెజాన్ ప్రైమ్ డే వచ్చేసింది..ఆఫర్లు కాదు బంపర్ ఆఫర్లు
Amazon Prime Day: అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026 తేదీలు వచ్చేశాయి!
Amazon Prime Day: అమెజాన్ ప్రైమ్ డే వచ్చేసింది..ఆఫర్లు కాదు బంపర్ ఆఫర్లు
Amazon Prime Day Sale 2026: ఈ ఏడాది అమెజాన్ ప్రైమ్ డే సేల్ జూలై 4 అర్ధరాత్రి ప్రారంభమై, జూలై 6 రాత్రి వరకు.. అంటే ఏకంగా 72 గంటల పాటు నాన్‌స్టాప్ ఆఫర్లతో సాగనుంది. ఈసారి ప్రైమ్ డే సేల్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ఇది అమెజాన్ నిర్వహిస్తున్న 10వ వార్షికోత్సవ ఎడిషన్ . అందుకే మునుపటి కంటే రెట్టింపు ఉత్సాహంతో, భారీ ఆఫర్లతో కస్టమర్లను ముంచెత్తడానికి కంపెనీ ప్లాన్ చేసింది.
ప్రైమ్ డే సేల్స్ కేవలం ప్రైమ్ సభ్యులకు మాత్రమే ప్రత్యేకం అన్న సంగతి తెలిసిందే. అందుకే ఇంకా సభ్యత్వం తీసుకోని వారి కోసం అమెజాన్ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. మెంబర్‌షిప్ ధరలను భారీగా తగ్గించింది.వార్షిక ప్రైమ్ రూ. 1,499 ఉన్న మెంబర్‌షిప్ ఇప్పుడు కేవలం రూ. 999 కే లభిస్తుంది. ప్రైమ్ లైట్ కేవలం రూ. 599 కే సొంతం చేసుకోవచ్చు. ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ కేవలం రూ. 299 తోనే ఈ ఎడిషన్ అందుబాటులోకి రానుంది.
షాపింగ్ చేసేటప్పుడు మరింత లాభం చేకూరేలా అమెజాన్ ప్రముఖ బ్యాంకులతో చేతులు కలిపింది.ఎస్‌బీఐ , యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్ పే ఐసీఐసీఐ కార్డ్ వినియోగదారులకు ఎలాంటి లిమిట్ లేకుండా 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్ లభించనుంది. ఈ సేల్‌లో కేవలం డిస్కౌంట్లే కాదు, వందలాది కొత్త ప్రొడక్ట్స్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నాయి. శాంసంగ్, వన్‌ప్లస్ , లెనొవొ , ఎల్‌జీ వంటి ఎలక్ట్రానిక్ దిగ్గజాలతో పాటు.. అడిడాస్ , పుమా వంటి లైఫ్‌స్టైల్ బ్రాండ్‌ల నుండి 500 కంటే ఎక్కువ సరికొత్త ఉత్పత్తులు ఈ సేల్ ద్వారా లాంచ్ కానున్నాయి.
అంతేకాకుండా, అమెజాన్ సొంత పరికరాలైన ఎకో , ఫైర్ టీవీ డివైజ్‌లపై ఏకంగా 45 శాతం వరకు భారీ తగ్గింపు ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇంకెందుకు ఆలస్యం? స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు, టీవీలు, హోమ్ అప్లయెన్సెస్ లేదా ఫ్యాషన్ దుస్తులు.. మీరు ఏది కొనాలనుకున్నా ఈ జూలై 4 నుంచి 6 మధ్య వచ్చే ‘అమెజాన్ ప్రైమ్ డే’ కంటే బెస్ట్ టైమ్ ఇంకొకటి ఉండదు. ఇప్పుడే మీ ప్రైమ్ మెంబర్‌షిప్ యాక్టివేట్ చేస్కోండి, సూపర్ డీల్స్ సొంతం చేసుకోండి.




