Anil Ambani: అనిల్ అంబానీ గ్రూప్‌కు ఈడీ భారీ షాక్ రూ. 510 కోట్ల ఆస్తుల జప్తు!
Anil Ambani: మనీ లాండరింగ్ కేసులో అనిల్ అంబానీ గ్రూప్‌నకు చెందిన రూ. 510 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది.
Anil Ambani: అనిల్ అంబానీ గ్రూప్‌కు ఈడీ భారీ షాక్ రూ. 510 కోట్ల ఆస్తుల జప్తు!
Anil Ambani Group ED Action: అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ చుట్టూ మనీ లాండరింగ్, బ్యాంకింగ్ మోసాల ఉచ్చు మరింత బిగుస్తోంది. రూ. వేల కోట్ల ప్రజాధనం మళ్లింపు వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద గ్రూప్‌నకు చెందిన ఏకంగా రూ. 510 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈడీ స్వాధీనం చేసుకున్న ఆస్తుల్లో ఖరీదైన ప్రైవేట్ జెట్‌లతో పాటు విలాసవంతమైన స్థిరాస్తులు, ఇతర ఫండ్లు ఉన్నాయి. మహారాష్ట్ర పరిధిలోని అత్యంత ఖరీదైన డాసాల్ట్ ఫాల్కన్ 2000, ఎంబ్రాయర్ అనే రెండు ప్రైవేట్ విమానాలు. మహారాష్ట్రలోని 6 విలువైన ప్లాట్లు, ప్రధాన కార్యాలయ ప్రాంగణం. తమిళనాడులోని రెండు విండ్ మిల్లులు , ఫిక్స్డ్ డిపాజిట్లు, బ్యాంక్ బ్యాలెన్స్‌లు.
వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి సేకరించిన ప్రజాధనాన్ని ప్రమోటర్లు తమ సొంత లాభాల కోసం ఉపయోగించుకున్నారని ఈడీ దర్యాప్తులో స్పష్టమైంది. నిధులను విదేశాలకు అక్రమంగా మళ్లించేందుకు దివాలా చట్టాన్ని సైతం దుర్వినియోగం చేసినట్లు విచారణాధికారులు తేల్చారు.
ఈ బ్యాంకింగ్ మోసం కేసులో ఈడీ చర్యలు అత్యంత వేగంగా కొనసాగుతున్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే 10 మందిని అరెస్టు చేశారు. ఫెమా నిబంధనల ప్రకారం ఇప్పటివరకు 6 ఛార్జిషీట్లు దాఖలయ్యాయి. తాజా రూ. 510 కోట్ల ఆస్తుల జప్తుతో కలిపి, ఈ కేసులో ఈడీ ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న లేదా జప్తు చేసిన మొత్తం ఆస్తుల విలువ ఏకంగా రూ. 23,100 కోట్లకు చేరుకుంది. వరుస సవాళ్లు, అప్పుల ఊబిలో ఉన్న అనిల్ అంబానీ గ్రూప్‌నకు ఈడీ తీసుకున్న ఈ కఠిన చర్యలు ఊహించని కోలుకోలేని దెబ్బ అని బిజినెస్ వర్గాలు భావిస్తున్నాయి.




