Atal pension yojana: రూ. 210తో నెలకు రూ. 5000 పెన్షన్ పొందే అవకాశం.. బెస్ట్ స్కీమ్
Atal pension yojana: రిటైర్మెంట్ గురించి చాలా మంది ముందుగా ఆలోచించరు. కానీ వయసు పెరిగే కొద్దీ ఆదాయం తగ్గి, ఖర్చులు పెరిగే సమయంలో ఇది పెద్ద సమస్యగా మారుతుంది.
Atal pension yojana
Atal pension yojana: రిటైర్మెంట్ గురించి చాలా మంది ముందుగా ఆలోచించరు. కానీ వయసు పెరిగే కొద్దీ ఆదాయం తగ్గి, ఖర్చులు పెరిగే సమయంలో ఇది పెద్ద సమస్యగా మారుతుంది. అలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అటల్ పెన్షన్ యోజన (APY) ఒక సురక్షితమైన పరిష్కారంగా నిలుస్తోంది. చిన్న మొత్తంతో ప్రారంభించి, భవిష్యత్తులో నెలకు స్థిరమైన పెన్షన్ పొందే అవకాశం ఈ పథకం ద్వారా లభిస్తుంది.
అటల్ పెన్షన్ యోజన అంటే ఏమిటి?
అటల్ పెన్షన్ యోజన ఒక ప్రభుత్వ పథకం. దీన్ని పింఛన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) నిర్వహిస్తుంది. ఈ పథకం ద్వారా 60 ఏళ్ల వయస్సు తర్వాత నెలకు రూ.1000 నుంచి రూ.5000 వరకు పెన్షన్ పొందవచ్చు. మీరు ఎంచుకున్న పెన్షన్ మొత్తానికి అనుగుణంగా ప్రతి నెలా ఒక నిర్దిష్ట మొత్తం బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది.
రూ.5000 పెన్షన్ కోసం ఎంత పెట్టుబడి అవసరం?
ఈ పథకంలో మీరు ఎంత త్వరగా చేరితే అంత తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందవచ్చు.
* 18 ఏళ్ల వయస్సులో చేరితే నెలకు సుమారు రూ.210 చెల్లించాల్సి ఉంటుంది.
* అదే 30 ఏళ్ల వయస్సులో చేరితే నెలకు సుమారు రూ.577 చెల్లించాలి.
* ఇక 40 ఏళ్ల వయస్సులో చేరితే నెలకు సుమారు రూ.1454 చెల్లించాల్సి ఉంటుంది.
కుటుంబానికి కూడా లాభం
ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే, పింఛన్ పొందుతున్న వ్యక్తి మరణించిన తర్వాత ఆయన/ఆమె జీవిత భాగస్వామికి అదే పెన్షన్ కొనసాగుతుంది. ఇద్దరూ మరణించిన తర్వాత దాదాపు కొంత ఫండ్ నామినీకి అందుతుంది. అంటే ఇది కుటుంబ భద్రతకూ ఉపయోగపడుతుంది.
ఈ పథకంలో ఎవరు చేరవచ్చు?
ఈ పథకంలో చేరడానికి కొన్ని సాధారణ అర్హతలు ఉన్నాయి. వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. భారత పౌరుడై ఉండాలి. బ్యాంక్ లేదా పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. ఈ అర్హతలు ఉన్నవారెవరైనా సులభంగా ఈ పథకంలో చేరవచ్చు.
ఎందుకు ఈ పథకాన్ని ఎంచుకోవాలి?
అటల్ పెన్షన్ యోజనలో పెట్టుబడి పెట్టడం వల్ల గ్యారంటీడ్ పెన్షన్ పెందొచ్చు. రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. చిన్న మొత్తంతో ప్రారంభించవచ్చు. ఆటో డెబిట్ వల్ల సేవింగ్స్ అలవాటు పెరుగుతుంది. రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత లభిస్తుంది. అదనంగా కుటుంబానికి కూడా రక్షణ ఉంటుంది.




