Bank Holidays: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా తొమ్మిది రోజులు సెలవులు

Bank Holidays: ఆగస్టు నెల రాబోతోంది.పండుగలు, జాతీయ దినోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 9 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.

Naresh.k
Published on: 31 July 2026 7:33 AM IST
Bank Holidays
X

Bank Holidays: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా తొమ్మిది రోజులు సెలవులు 

Bank Holidays August: కొత్త నెల ఆగస్టు ప్రారంభం కాబోతోంది. కొత్త నెల వచ్చిందంటే చాలు... మన రోజువారీ బడ్జెట్ నుంచి వ్యాపార లావాదేవీల వరకు ఎన్నో మార్పులు ముడిపడి ఉంటాయి. ఇక సామాన్యుడి నుంచి బడా వ్యాపారి వరకు ప్రతిఒక్కరికీ బ్యాంకులతో ఏదో ఒక పని ఉండే తీరుతుంది. అందుకే, కొత్త నెల రాగానే అందరూ ముందుగా వెతికేది బ్యాంకు సెలవుల గురించే. ముందే సెలవుల జాబితా తెలుసుకుంటే, ఏ బ్యాంకు పని ఏ రోజు పూర్తి చేసుకోవాలో ఒక స్పష్టమైన ప్రణాళిక వేసుకోవచ్చు.ఆగస్టులో సెలవుల సందడి... ఏ రోజున ఎక్కడ మూతపడతాయంటే..?ఈ ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా విభిన్న ప్రాంతీయ పండుగలు, జాతీయ దినోత్సవాల సందర్భంగా మొత్తం 9 రోజులు ప్రత్యేక సెలవులు రానున్నాయి.

ఆగస్టు 4 కేర్ పూజ సందర్భంగా త్రిపురలో బ్యాంకులకు సెలవు.ఆగస్టు 8 టెండోంగ్ లో రమ్ ఫాట్ పండుగను పురస్కరించుకుని సిక్కింలో బ్యాంకులు పనిచేయవు. ఆగస్టు 13 దేశభక్తుల దినోత్సవం సందర్భంగా మణిపూర్‌లో బ్యాంకులు క్లోజ్ ఉంటాయి.

ఆగస్టు 15 మన జాతీయ పండుగ అయిన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూతపడతాయి.ఆగస్టు 19 మహారాజా బీర్ విక్రమ్ కిషోర్ మాణిక్య బహదూర్ జయంతి సందర్భంగా త్రిపురలో సెలవు. ఆగస్టు 25 మిలాద్-ఉన్-నబీ, మొదటి ఓనం, మిలాద్-ఎ-షరీఫ్ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళలో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. కాబట్టి ఏపీ ప్రజలు ఈ రోజున బ్యాంకు పనులు లేకుండా ముందే ప్లాన్ చేసుకోవడం మంచిది.

ఆగస్టు 28 రక్షా బంధన్, పాంగ్-లబ్సోల్, ఈద్-ఇ-మిలాద్-ఉన్-నబీ, శ్రీనారాయణ గురు జయంతి సందర్భంగా గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, జమ్మూ, శ్రీనగర్, కేరళ, హిమాచల్ ప్రదేశ్ వంటి పలు రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు. పైన పేర్కొన్న పండుగలు, ప్రత్యేక దినోత్సవ సెలవులతో పాటుగా ఆదివారాలు, శనివారాల సాధారణ సెలవులు కూడా కలుపుకుని చూసుకోవాల్సి ఉంటుంది.

వివిధ రాష్ట్రాల్లో జరుపుకునే పండుగలను బట్టి ఆయా ప్రాంతాల్లో బ్యాంకు సెలవులు మారుతుంటాయి. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, ముఖ్యంగా ఆగస్టు 15 జాతీయ సెలవుతో పాటు, ఆగస్టు 25న ఏపీలో బ్యాంకులు మూతపడనున్నాయి. కాబట్టి నగదు ఉపసంహరణలు, డిపాజిట్లు, చెక్కుల క్లియరెన్స్ వంటి ముఖ్యమైన పనులు ఉన్నవారు ఈ సెలవుల క్యాలెండర్‌ను దృష్టిలో ఉంచుకుని ప్లాన్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story