Bank Holidays : బ్యాంకు వినియోగదారులకు అలర్ట్.. జూన్ నెలలో ఏకంగా 11 రోజులు బ్యాంకులు బంద్
Bank Holidays : ఆర్బీఐ జూన్ 2026 నెలకు సంబంధించిన బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ నెలలో శని, ఆదివారాలు, పండుగలతో కలిపి మొత్తం 11 రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి.
Bank Holidays
Bank Holidays : మే నెల ముగిసి జూన్ నెల ప్రారంభం కాబోతోంది. ఈ కొత్త నెలలో మీకు బ్యాంకుకు సంబంధించి ఏవైనా ముఖ్యమైన పనులు ఉన్నాయా..? చెక్ బుక్ తీసుకోవడం, కొత్త అకౌంట్ తెరవడం, పాస్‌బుక్ అప్‌డేట్ లేదా లోన్ల కోసం బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీకు అలర్ట్. జూన్ 2026 నెలకు సంబంధించిన అధికారిక బ్యాంకు సెలవుల జాబితాను భారతీయ రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసింది. ఈ తాజా క్యాలెండర్ ప్రకారం జూన్ నెలలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో కలిపి మొత్తం 11 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. ఇందులో ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలతో పాటు మొహర్రం, ఇతర ప్రాంతీయ పండుగల సెలవులు కూడా కలిసి ఉన్నాయి. కాబట్టి మీ ఆర్థిక లావాదేవీలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండాలంటే ఇప్పుడే ఈ సెలవుల లిస్ట్‌ను చూసి ప్లాన్ చేసుకోండి.
మూడు కేటగిరీలుగా బ్యాంకు సెలవులు
ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకు సెలవులను మూడు కేటగిరీలుగా విభజిస్తారు. జాతీయ సెలవులు దేశమంతటా ఒకేలా అమలవుతాయి. కానీ, కొన్ని ప్రాంతీయ పండుగలు, ప్రత్యేక దినోత్సవాల సెలవులు మాత్రం ఆయా రాష్ట్రాల సంస్కృతి, ప్రభుత్వ నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి. జూన్ నెలలో 7, 14, 21, 28 తేదీలలో సాధారణ ఆదివారం సెలవులు ఉండగా.. జూన్ 13న రెండో శనివారం, జూన్ 27న నాలుగో శనివారం కారణంగా దేశంలోని అన్ని బ్యాంకులు మూతపడనున్నాయి. మిగిలిన సెలవులు వివిధ రాష్ట్రాల్లోని స్థానిక పండుగల ప్రకారం వర్తిస్తాయి.
తెలుగు రాష్ట్రాల్లో మొహర్రం సెలవులు
ఈ జూన్ నెలలో ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే మొహర్రం పండుగ రాబోతోంది. అయితే, ఈ పండుగ సెలవు తేదీలలో తెలుగు రాష్ట్రాల మధ్య చిన్న వ్యత్యాసం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 25 (గురువారం) నాడు మొహర్రం సెలవును ప్రకటించారు. కాబట్టి ఆ రోజు ఏపీలో బ్యాంకులు పనిచేయవు. ఇక తెలంగాణ రాష్ట్రంలో జూన్ 26 (శుక్రవారం) నాడు మొహర్రం సందర్భంగా బ్యాంకులకు అధికారిక సెలవు ఉంటుంది. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, యూపీ, బిహార్ వంటి మరో 13 రాష్ట్రాలలో కూడా జూన్ 26నే బ్యాంకులు బంద్ కానున్నాయి.
మొహర్రం వేళ వరుసగా 3 రోజులు లాంగ్ వీకెండ్
జూన్ చివరి వారంలో బ్యాంకు ఉద్యోగులకు, ఖాతాదారులకు లాంగ్ వీకెండ్ రాబోతోంది. తెలంగాణతో పాటు పలు ప్రధాన రాష్ట్రాలలో జూన్ 26 శుక్రవారం మొహర్రం సెలవు ఉంది. ఆ మరుసటి రోజు జూన్ 27 నాలుగో శనివారం, అలాగే జూన్ 28 ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. దీనివల్ల నెల చివర్లో వరుసగా 3 రోజులు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. కాబట్టి అత్యవసరమైన డాక్యుమెంట్ల పనులు, డ్రాఫ్టుల క్లియరెన్స్ వంటి పనులను ఈ వీకెండ్ కంటే ముందే పూర్తి చేసుకోవడం మంచిది.
బ్యాంకు బ్రాంచ్‌లు 11 రోజుల పాటు మూతపడినంత మాత్రాన వినియోగదారుల రోజువారీ ఆర్థిక లావాదేవీలు ఆగిపోవని ఆర్బీఐ స్పష్టం చేసింది. డిజిటల్ బ్యాంకింగ్ సేవలు ఎప్పటికప్పుడు, విరామం లేకుండా 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ సేవలతో పాటు మొబైల్ బ్యాంకింగ్ యాప్స్, నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉంటాయి. వీటి ద్వారా మీరు ఎవరికైనా డబ్బులు పంపాలన్నా, బిల్లులు చెల్లించాలన్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు.
* 07 జూన్ 2026 (ఆదివారం): వీక్లీ ఆఫ్ : భారతదేశం అంతటా అన్ని బ్యాంకులకు సెలవు.
* 13 జూన్ 2026 (శనివారం): రెండో శనివారం
* 14 జూన్ 2026 (ఆదివారం): వీక్లీ ఆఫ్
* 15 జూన్ 2026 (సోమవారం): రాజా సంక్రాంతి / వైఎమ్ఏ డే : ఒడిశా, మిజోరం రాష్ట్రాల్లో మాత్రమే బ్యాంకులు బంద్.
* 21 జూన్ 2026 (ఆదివారం): వీక్లీ ఆఫ్
* 25 జూన్ 2026 (గురువారం): మొహర్రం పండుగ : ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే బ్యాంకులకు సెలవు.
* 26 జూన్ 2026 (శుక్రవారం): మొహర్రం పండుగ : తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, యూపీ, బిహార్, వెస్ట్ బెంగాల్, ఎంపీ, జమ్మూ కాశ్మీర్, త్రిపుర, మిజోరం, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.
* 27 జూన్ 2026 (శనివారం): నాలుగో శనివారం
* 28 జూన్ 2026 (ఆదివారం): వీక్లీ ఆఫ్
* 29 జూన్ 2026 (సోమవారం): సంత్ గురు కబీర్ జయంతి : హిమాచల్ ప్రదేశ్‌లో మాత్రమే బ్యాంకులకు సెలవు.
* 30 జూన్ 2026 (మంగళవారం): రెమ్నా ని : మిజోరం రాష్ట్రంలో మాత్రమే బ్యాంకులు బంద్.




