Bank Holidays: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. వచ్చే వారం 3 రోజులు బ్యాంకులు బంద్!
Bank Holidays: వచ్చే వారం సెప్టెంబర్ 7 నుంచి 13 మధ్య బ్యాంకులకు 3 రోజులు సెలవులు రానున్నాయి. ఏయే రోజుల్లో బ్యాంకులు బంద్ ఉంటాయో పూర్తి వివరాలివే!
Bank Holidays: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. వచ్చే వారం 3 రోజులు బ్యాంకులు బంద్!
Bank Holidays Next Week: డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ, కొన్ని పనుల కోసం ఖాతాదారులు తప్పనిసరిగా బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి వారు బ్యాంకుల సెలవు రోజులను ముందుగానే తెలుసుకోవడం మంచిది. సెప్టెంబర్ 7 నుంచి 13 వరకు బ్యాంకులకు మొత్తం మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి.
సెప్టెంబర్ 11, శుక్రవారం
సెప్టెంబర్ 11న జైపూర్‌లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కారణంగా బ్యాంకులు మూసి ఉంటాయి. అలాగే ఢిల్లీలో బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించిన నేపథ్యంలో.. అక్కడి కొన్ని బ్యాంకు శాఖల కార్యకలాపాలపై కూడా ప్రభావం ఉండే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 12, శనివారం
సెప్టెంబర్ 12న రెండో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖలు పనిచేయవు. అదనంగా కొన్ని ప్రాంతాల్లో స్థానిక పండుగల కారణంగా కూడా బ్యాంకులకు సెలవు ఉండవచ్చు. అయితే ప్రాంతాన్ని బట్టి సెలవుల వివరాల్లో మార్పులు ఉండొచ్చు.
సెప్టెంబర్ 13, ఆదివారం
సెప్టెంబర్ 13 ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సాధారణ వారాంతపు సెలవు ఉంటుంది.
డిజిటల్ సేవలు కొనసాగుతాయి
బ్యాంకు బ్రాంచ్‌లు మూసి ఉన్నప్పటికీ ఖాతాదారులకు డిజిటల్ బ్యాంకింగ్ సేవలు సాధారణంగా అందుబాటులో ఉంటాయి. UPI, ATM, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి సేవలను వినియోగించుకోవచ్చు. డబ్బు బదిలీ, ఆన్‌లైన్ చెల్లింపులు, బ్యాలెన్స్ చెక్ వంటి పనులను ఇంటి నుంచే పూర్తి చేసుకోవచ్చు.
అయితే నగదు డిపాజిట్, చెక్ సంబంధిత పనులు, ఇతర బ్రాంచ్ ఆధారిత సేవలు అవసరమైతే.. బ్యాంకు సెలవుల షెడ్యూల్‌ను ముందుగానే పరిశీలించి, అందుకు అనుగుణంగా మీ పనులను ప్లాన్ చేసుకోవడం మంచిది.




