Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఏయే రోజుల్లో అంటే.?
Bank Holidays: అక్టోబర్ 2026లో పండుగలు, జాతీయ దినోత్సవాలు, వారాంతపు సెలవులు ఎక్కువగా ఉండటంతో బ్యాంకు శాఖలకు పలు రోజులు మూతపడనున్నాయి.
Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఏయే రోజుల్లో అంటే.?
Bank Holidays: అక్టోబర్ 2026లో పండుగలు, జాతీయ దినోత్సవాలు, వారాంతపు సెలవులు ఎక్కువగా ఉండటంతో బ్యాంకు శాఖలకు పలు రోజులు మూతపడనున్నాయి. స్థానిక పండుగలు, రాష్ట్రాల వారీగా ఉన్న బ్యాంకింగ్ హాలిడే క్యాలెండర్ ఆధారంగా ఏయే తేదీల్లో బ్యాంకులు పనిచేయవో ఇప్పుడు చూద్దాం.
అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా సెలవు
అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖలు పనిచేయవు. అక్టోబర్ 10న మహాలయ అమావాస్య సందర్భంగా బెంగళూరు, కోల్‌కతాలో బ్యాంకులకు సెలవు ఉంటుంది. అదే రోజు రెండో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖలకు సాధారణ సెలవు కూడా ఉంటుంది. అక్టోబర్ 17న మహా సప్తమి సందర్భంగా అగర్తలలో బ్యాంకులు మూసి ఉంటాయి.
దసరా, దుర్గాపూజకు వరుస సెలవులు
అక్టోబర్ 19న దుర్గాపూజ, మహాష్టమి, మహానవమి సందర్భంగా పలు రాష్ట్రాలు, నగరాల్లో బ్యాంకు సేవలు నిలిచిపోతాయి. అక్టోబర్ 20న దసరా, విజయదశమి సందర్భంగా అనేక ప్రాంతాల్లో బ్యాంకు శాఖలకు సెలవు ఉంటుంది. అక్టోబర్ 21న కూడా విజయదశమి, దుర్గాపూజ కారణంగా అగర్తలా, బెంగళూరు, గ్యాంగ్‌టక్, గువాహటి, కొచ్చి, కోల్‌కతా, తిరువనంతపురం తదితర ప్రాంతాల్లో బ్యాంకులు పనిచేయవు.
అక్టోబర్ చివరి వారంలోనూ సెలవులు
అక్టోబర్ 22, 23 తేదీల్లో దుర్గాపూజ, దసైన్ సందర్భంగా గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి. అక్టోబర్ 24న నాలుగో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖలు మూసి ఉంటాయి. అక్టోబర్ 26న లక్ష్మీపూజ, మహర్షి వాల్మీకి జయంతి, యాక్సెసిబిలిటీ డే సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
అక్టోబర్ 29న కర్వా చౌత్ సందర్భంగా సిమ్లాలో బ్యాంకు శాఖలు పనిచేయవు. అక్టోబర్ 31న సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా అహ్మదాబాద్‌లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. అక్టోబర్‌లో వచ్చే అన్ని ఆదివారాల్లోనూ బ్యాంకు శాఖలు సాధారణంగా మూసి ఉంటాయి.
బ్యాంకు సెలవుల్లోనూ డిజిటల్ సేవలు
బ్యాంకు శాఖలు సెలవులో ఉన్న రోజుల్లో కౌంటర్ ద్వారా నిర్వహించే సేవలు అందుబాటులో ఉండకపోవచ్చు. అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఏటీఎంలు, డెబిట్, క్రెడిట్ కార్డు సేవలు సాధారణంగా కొనసాగుతాయి. నగదు జమ చేయడం, చెక్కులు, రుణ సంబంధిత పనులు, ఇతర శాఖ ఆధారిత సేవలు అవసరమైతే ముందుగానే బ్యాంకు సెలవుల జాబితాను పరిశీలించడం మంచిది. ముఖ్యంగా అక్టోబర్‌లో కొన్ని ప్రాంతాల్లో వరుసగా సెలవులు ఉండే అవకాశం ఉన్నందున అత్యవసర బ్యాంకింగ్ పనులను ముందుగానే పూర్తి చేసుకోవడం మంచిది.




