Bank holidays: బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్..!

Bank holidays: యూఎఫ్ బీయూ సమ్మె, వారంతపు సెలవులు , వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 11 నుంచి వరుసగా 4 రోజుల పాటు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి.

Gagan kumar
Published on: 10 Sept 2026 10:17 AM IST
Bank holidays
X

Bank holidays: బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్..!

Bank holidays: దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకింగ్ ఖాతాదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురుకానున్నాయి. సెప్టెంబర్ 11 నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బ్యాంకు ఉద్యోగ సంఘాలు చేపడుతున్న ఒకరోజు సమ్మెకు, దానికి వరుసగా వచ్చే వారంతపు సెలవులు, పండుగ సెలవు తోడవడమే ఇందుకు కారణం. దీంతో అత్యవసర ఆర్థిక లావాదేవీలు ఉన్నవారు, చెక్కుల క్లియరెన్స్ వంటి పనులు ఉన్నవారు గురువారంలోపే ముగించుకోవాలని బ్యాంకింగ్ నిపుణులు సూచిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే, తమ దీర్ఘకాలిక డిమాండ్ల పరిష్కారం కోసం యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా సెప్టెంబర్ 11 (శుక్రవారం) నాడు బ్యాంకర్లు విధులను బహిష్కరించనున్నారు. ఈ సమ్మె ముగిసిన మరుసటి రోజే సెప్టెంబర్ 12 (రెండో శనివారం), సెప్టెంబర్ 13 (ఆదివారం) సాధారణ సెలవులు వచ్చాయి.

ఇక సెప్టెంబర్ 14 (సోమవారం) నాడు వినాయక చవితి పండగను పురస్కరించుకుని పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు కానుంది. ఫలితంగా శుక్రవారం నుంచి సోమవారం వరకు వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంక్ శాఖలు మూతపడనున్నాయి.

వారానికి 5 రోజుల పనిదినాల విధానాన్ని తక్షణమే అమలు చేయాలన్నదే బ్యాంక్ ఉద్యోగుల ప్రధాన డిమాండ్. దీనిపై 2024లోనే సూత్రప్రాయ అవగాహన కుదిరినప్పటికీ, ప్రభుత్వం వైపు నుంచి అమలు ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోందని యూనియన్లు మండిపడుతున్నాయి.

దీనికి తోడు పెన్షన్ సంబంధిత సమస్యలను పరిష్కరించాలని, పాయింట్ బేస్డ్ ప్రోత్సాహకాల విధానాన్ని సమీక్షించాలని పట్టుబడుతున్నాయి. ఈ అంశంపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ , ప్రభుత్వ ప్రతినిధులతో సెప్టెంబర్ 9న జరిగిన చర్చలు విఫలమయ్యాయి. రాబోయే బ్రిక్స్ సదస్సు దృష్ట్యా సమ్మెను వాయిదా వేయాలని అధికారులు విజ్ఞప్తి చేసినప్పటికీ, రాతపూర్వక హామీ లభించకపోవడంతో సమ్మె బాట పట్టడానికే ఉద్యోగులు మొగ్గుచూపారు.

ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోతే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని యూఎఫ్ బీయూ స్పష్టం చేసింది. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మరో మూడు రోజుల సమ్మె, ఆ తర్వాత కూడా పరిష్కారం లభించకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించింది. ఈ సమ్మె ప్రభావం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తో పాటు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులపై తీవ్రంగా ఉండనుంది.

నాలుగు రోజుల వరుస సెలవుల నేపథ్యంలో డిపాజిట్లు, విత్‌డ్రాలు, డిమాండ్ డ్రాఫ్ట్‌లు, రుణాల మంజూరు, చెక్కుల క్లియరెన్స్ వంటి కీలక లావాదేవీలన్నీ నిలిచిపోనున్నాయి. అయితే, యూపీఐ , నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ మరియు ఏటీఎం సేవలు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి.

కానీ, వరుస సెలవుల వల్ల ఏటీఎంలలో నగదు త్వరగా అయిపోయి కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నందున, డిజిటల్ పేమెంట్లను ఆశ్రయించడం లేదా తగినంత నగదును ముందుగానే సమకూర్చుకోవడం మంచిది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story