Game Changer: ఐటీ రంగంలో సత్తా చాటాలంటే ఫండమెంటల్స్ చాలా ముఖ్యం: ప్రవీణ భీమవరపు

Game Changer: కెరీర్‌లో రాణించాలంటే బేసిక్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్‌సెట్ ఎంత ముఖ్యమో మాక్సిమస్ ఇండియా కంట్రీ హెడ్ ప్రవీణ భీమవరపు హెచ్‌ఎంటీవీ ఇంటర్వ్యూలో వివరించారు.

Arun Chilukuri
Published on: 11 Sept 2026 12:27 PM IST
Game Changer
X

Game Changer: ఐటీ రంగంలో సత్తా చాటాలంటే ఫండమెంటల్స్ చాలా ముఖ్యం: ప్రవీణ భీమవరపు

Game Changer: ఏ రంగంలోనైనా, ముఖ్యంగా ఐటీ సెక్టార్‌లో రాణించాలంటే ప్రాథమిక అంశాలు మరియు సమస్యలను పరిష్కరించే తత్వమే అత్యంత కీలకమని మాక్సిమస్ ఇండియా కంట్రీ హెడ్ ప్రవీణ భీమవరపు స్పష్టం చేశారు. హెచ్‌ఎంటీవీ 'గేమ్ ఛేంజర్' కార్యక్రమంలో భాగంగా ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరీర్ ప్రయాణం, విద్యార్థులు, యువత పాటించాల్సిన మెలకువలను పంచుకున్నారు.

కంప్యూటర్ సైన్స్ లేదా మరే ఇతర సబ్జెక్ట్ అయినా ఫౌండేషన్ గట్టిగా ఉంటేనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ప్రవీణ తెలిపారు. ఐటీ రంగంలో రాణించాలనుకునే వారు ఐటీ లాంగ్వేజెస్, డేటాబేస్ లాంగ్వేజెస్, స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ మరియు ఆపరేటింగ్ సిస్టమ్స్‌పై బలమైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గణితం, సైన్స్, హ్యుమానిటీస్ లేదా ఆర్ట్స్.. ఏ రంగమైనా బేసిక్స్ పక్కాగా ఉంటేనే అద్భుతాలు సృష్టించవచ్చని పేర్కొన్నారు.

జీవితంలో లేదా కెరీర్‌లో ఎదురయ్యే అడ్డంకులను వ్యక్తిగత, సామాజిక , సామర్థ్యపరమైన సవాళ్లుగా విభజించవచ్చని ప్రవీణ వివరించారు. ముఖ్యంగా మహిళలు, తల్లులు కెరీర్‌లో ముందుకు వెళ్లేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన సామాజిక బాధ్యతలు, సవాళ్లు ఎదురవుతాయని చెప్పారు. వీటిని అధిగమించడానికి సహాయం కోరడంలో ఎలాంటి సంకోచం ఉండకూడదని, కుటుంబం నుంచి తగిన మద్దతు తీసుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.