NSE: బిగ్గెస్ట్ ఐపీఓ వచ్చేస్తోంది.! ఇన్వెస్టర్లకు ఇక కాసుల వర్షం కురవాల్సిందే..
NSE: దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ రాబోతోందా? నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సెప్టెంబరులో భారీ పబ్లిక్ ఇష్యూకు ప్లాన్ చేస్తున్న వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత భారీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్)కు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ వచ్చే సెప్టెంబరు నాటికి పబ్లిక్ ఇష్యూను లాంచ్ చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. ఈ భారీ ఐపీఓ ద్వారా ఏకంగా 3 బిలియన్ డాలర్లు(అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు రూ. 28,613 కోట్లు) సమీకరించాలని ఎన్ఎస్ఈ యాజమాన్యం భావిస్తోంది. ఈ ఐపీఓ సన్నాహకాల్లో భాగంగా వచ్చే వారం నుంచే దేశీయ, అంతర్జాతీయ మదుపరులతో సంస్థ ప్రతినిధులు సమావేశాలు జరపనున్నారు. భారత్‌తో పాటుగా సింగపూర్, హాంగ్ కాంగ్, మిడిల్ ఈస్ట్ దేశాలు, అమెరికా, యూకే తదితర ప్రాంతాల్లో ఇన్వెస్టర్ మీటింగ్స్ నిర్వహించేందుకు ఎన్ఎస్ఈ పక్కా ప్లాన్ చేసింది.
అన్నీ తాము అనుకున్నట్లుగానే జరిగితే, భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇదే అత్యంత భారీ ఐపీఓగా రికార్డు సృష్టించనుంది. అయితే, మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. రిలయన్స్‌కి చెందిన 'జియో' ఐపీఓ కూడా త్వరలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అంచనాల ప్రకారం సుమారు రూ. 35 వేల కోట్లతో జియో ఐపీఓ గనక వస్తే, అప్పుడు ఎన్ఎస్ఈ రికార్డును అది సులభంగా బీట్ చేయవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఈ సెప్టెంబర్ నెల చాలా కీలకం కానుందని నిపుణులు చెబుతున్నారు.