Birth & Death Certificates Rules: ఇకపై బర్త్, డెత్ సర్టిఫికెట్లు పొందడం కష్టమే.. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి కేంద్రం కఠిన నిబంధనలు!
Birth & Death Certificates Rules: అక్టోబర్ 1 నుంచి జనన, మరణ సర్టిఫికెట్లకు కొత్త రూల్స్. రెండేళ్లు దాటితే కోర్టు ఆర్డర్ తప్పనిసరి.
Birth & Death Certificates Rules: ఇకపై బర్త్, డెత్ సర్టిఫికెట్లు పొందడం కష్టమే.. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి కేంద్రం కఠిన నిబంధనలు!
Birth & Death Certificates Rules: జనన, మరణ ధ్రువీకరణ పత్రాల (Birth & Death Certificates) జారీ ప్రక్రియలో జాప్యానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ (అమెండ్‌మెంట్) యాక్ట్, 2026 పేరిట తీసుకొచ్చిన నూతన నిబంధనలు 2026 అక్టోబర్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి.
ఈ కొత్త చట్టం ప్రకారం జననం లేదా మరణం జరిగిన 21 రోజుల్లోగా ఉచితంగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆలస్యమయ్యే కొద్దీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అత్యంత నిబంధనలతో కఠినతరం కానుంది.
నూతన నిబంధనల ప్రకారం ఒక సంవత్సరం దాటి, రెండేళ్ల లోపు నమోదు చేసుకోవాలంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ (DM), సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ (SDM) లేదా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ద్వారా ముందస్తు అనుమతి పొంది, ఆయా అధికారుల విచారణ అనంతరమే నమోదు చేస్తారు.
ఇక ఏళ్ల తరబడి నమోదు కాకుండా రెండేళ్లు దాటిన కేసుల్లో సాధారణ పాలనా అధికారులకు ఎలాంటి అధికారాలు ఉండవు. ఇలాంటి తీవ్ర జాప్య కేసులకు ఫస్ట్ క్లాస్ జుడిషియల్ మెజిస్ట్రేట్ (JMFC) కోర్టు ఉత్తర్వులు తప్పనిసరి చేశారు. న్యాయస్థానం క్షుణ్ణంగా పరిశీలించి ఆదేశాలు జారీ చేసిన తర్వాతే ప్రక్రియ ముందుకు సాగుతుంది.
ఈ నూతన రూల్స్ ద్వారా నకిలీ రికార్డులను అరికట్టడంతో పాటు పౌరులలో జవాబుదారీతనాన్ని, సకాలంలో నమోదు చేసుకునే అలవాటును పెంచవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి మీ కుటుంబంలో ఇప్పటి వరకు నమోదు కాకుండా మిగిలిపోయిన జనన, మరణాల రికార్డులు ఉంటే వెంటనే స్థానిక మున్సిపల్ లేదా పంచాయతీ ఆఫీసును సంప్రదించి ప్రక్రియ పూర్తి చేసుకోవడం మంచిది. ఆలస్యం చేస్తే భవిష్యత్తులో విద్య, ఉద్యోగాలు, ఆస్తి వారసత్వాల విషయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.




