BSNL కొత్త ఆఫర్.. 25+ OTTల నుంచి నచ్చినవి ఎంచుకోండి
BSNL Bharat Fiber యూజర్ల కోసం కొత్త BYO OTT పోర్టల్. 25+ OTTల నుంచి నచ్చినవి ఎంచుకుని ప్రతి నెలా ప్యాక్ మార్చుకోవచ్చు.
BSNL Bharat Fiber
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ కస్టమర్ల కోసం సరికొత్త ఓటీటీ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. టెలికాం రంగంలో తొలిసారిగా BYO OTT (Build Your Own OTT) Builder పోర్టల్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా భారత్ ఫైబర్ వినియోగదారులు 25కు పైగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో తమకు నచ్చిన వాటిని ఎంచుకుని సొంత ఓటీటీ ప్యాక్‌ను రూపొందించుకోవచ్చు.
25కు పైగా ఓటీటీల నుంచి ఎంపిక
బీఎస్ఎన్ఎల్ కొత్త పోర్టల్‌లో జియోహాట్‌స్టార్, జీ5, సోనీలివ్, హంగామా, ఫ్యాన్‌కోడ్, హోయ్‌చోయ్, షెమరూ మీ, లయన్స్‌గేట్ ప్లే వంటి 25కు పైగా ప్రముఖ ఓటీటీ యాప్స్ అందుబాటులో ఉన్నాయి.
యూజర్లు తమకు అవసరమైన ఓటీటీ యాప్స్‌ను మాత్రమే ఎంచుకుని ప్యాక్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రతి నెలా తమ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఎంచుకున్న ఓటీటీ యాప్స్‌ను మార్చుకునే అవకాశం కూడా ఉంది.
విడివిడిగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు తీసుకోవడంతో పోలిస్తే కాంబో ప్యాక్ ద్వారా తక్కువ ఖర్చుతో వినోద సేవలను పొందే అవకాశం ఉంటుందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.
Cinema Plus పోర్టల్ ద్వారా సేవలు
ఈ ఓటీటీ సేవలను Cinema Plus (cinemaplus.bsnl.in) అనే వెబ్ పోర్టల్ ద్వారా అందిస్తున్నారు. భారత్ ఫైబర్ కస్టమర్లు తమ బ్రాడ్‌బ్యాండ్ నంబర్‌తో లాగిన్ అయి నచ్చిన ఓటీటీ ప్యాక్‌ను ఎంపిక చేసుకోవచ్చు.
అలాగే గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి BSNL New Selfcare App డౌన్‌లోడ్ చేసుకుని కూడా ఓటీటీ ప్యాక్‌ను కస్టమైజ్ చేసుకునే అవకాశం ఉంది.
ఎలా పొందాలి?
బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ కస్టమర్లు Cinema Plus వెబ్‌సైట్‌ను సందర్శించి తమ బ్రాడ్‌బ్యాండ్ నంబర్‌తో లాగిన్ కావాలి. అనంతరం అందుబాటులో ఉన్న ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో తమకు నచ్చిన వాటిని ఎంచుకుని ప్యాక్‌ను రూపొందించుకోవచ్చు.
మరింత సమాచారం కోసం బీఎస్ఎన్ఎల్ టోల్‌ఫ్రీ నంబర్ 1800-4444ను సంప్రదించవచ్చు.
ప్రైవేట్ టెలికాం సంస్థల నుంచి పోటీ పెరుగుతున్న సమయంలో భారత్ ఫైబర్ కస్టమర్లను ఆకర్షించేందుకు బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ఈ కొత్త సదుపాయం ఉపయోగపడే అవకాశం ఉంది. ముఖ్యంగా తమకు అవసరమైన ఓటీటీలను మాత్రమే ఎంచుకునే అవకాశం ఉండటం వినియోగదారులకు అదనపు సౌలభ్యాన్ని అందించనుంది.




