BSNL: బీఎస్ఎన్ఎల్ బంఫర్ ఆఫర్.. కేవలం ఒక్క రూపాయికే రీఛార్జ్.. 24 రోజుల వ్యాలిడిటీతో డైలీ 1 జీబీ డేటాతో మరెన్నో..!
BSNL 1 Rupee Recharge Plan: స్మార్ట్‌ఫోన్ రీఛార్జ్ బిల్లులు రోజురోజుకూ భారంగా మారుతున్న వేళ, సామాన్యుల జేబులకు భారం తగ్గించే దిశగా బీఎస్ఎన్ఎల్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.
BSNL: బీఎస్ఎన్ఎల్ బంఫర్ ఆఫర్.. కేవలం ఒక్క రూపాయికే రీఛార్జ్.. 24 రోజుల వ్యాలిడిటీతో డైలీ 1 జీబీ డేటాతో మరెన్నో..!
BSNL 1 Rupee Recharge Plan: ప్రైవేట్ టెలికాం సంస్థల రీఛార్జ్ ధరల మోతతో బెంబేలెత్తిపోతున్న సామాన్య వినియోగదారులకు ప్రభుత్వ రంగ దిగ్గజం బీఎస్ఎన్ఎల్ శుభవార్త చెప్పింది. కేవలం ఒక్క రూపాయి ఖర్చుతో దాదాపు నెల రోజుల పాటు ఉచిత కాలింగ్, రోజూ డేటా పొందే అద్భుతమైన సదుపాయాన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది.
ప్రైవేట్ నెట్‌వర్క్‌ల దోపిడీకి బీఎస్ఎన్ఎల్ సరికొత్త చెక్..
స్మార్ట్‌ఫోన్ రీఛార్జ్ బిల్లులు రోజురోజుకూ భారంగా మారుతున్న వేళ, సామాన్యుల జేబులకు భారం తగ్గించే దిశగా బీఎస్ఎన్ఎల్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో ఇతర నెట్‌వర్క్‌లు తమ టారిఫ్ ధరలను విపరీతంగా పెంచేసిన తరుణంలో, ప్రభుత్వ రంగ సంస్థ తెచ్చిన ఈ సరికొత్త రీఛార్జ్ ప్లాన్ టెలికాం రంగంలో సరికొత్త చర్చకు తెరలేపింది. దేశంలోని అన్ని టెలికాం సర్కిళ్ల పరిధిలో ఈ ఆఫర్ వర్తిస్తుందని సంస్థ స్పష్టం చేసింది.
ఒక్క రూపాయి ప్యాక్.. లభించే అద్భుత ప్రయోజనాలివే..!
ఈ ఆఫర్ కింద యూజర్లకు లభించే సౌకర్యాలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. నామమాత్రపు ఒక్క రూపాయి చెల్లింపుతో ఏకంగా 24 రోజుల సర్వీస్ వ్యాలిడిటీ లభిస్తుంది.
* రోజూ 1 జీబీ హై-స్పీడ్ డేటా వస్తుంది (మొత్తంగా 24 రోజుల కాలానికి 24 జీబీ డేటా).
* దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా నిరభ్యంతరంగా మాట్లాడుకునే అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయం ఉంటుంది.
* దీంతో పాటు రోజుకు 100 ఉచిత ఎస్సెమ్మెస్‌లు వాడుకోవచ్చు (మొత్తం వ్యాలిడిటీలో 2,400 ఎస్సెమ్మెస్‌లు).
ఈ చౌకైన ఆఫర్ ఎవరికి వర్తిస్తుంది?
అయితే ఈ రీఛార్జ్ కూపన్ పొందడానికి ఒక నిబంధన ఉంది. ఈ బంపర్ ఆఫర్‌ను బీఎస్ఎన్ఎల్ కేవలం కొత్త కస్టమర్ల కోసమే ప్రవేశపెట్టింది. దీనిని ఫస్ట్ రీఛార్జ్ కూపన్ (FRC) జాబితాలో చేర్చారు. అంటే కొత్తగా బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు తీసుకునే వినియోగదారులు మాత్రమే తమ మొట్టమొదటి రీఛార్జ్ రూపంలో ఈ ఒక్క రూపాయి ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. పాత వినియోగదారులకు ఈ ప్రత్యేక కూపన్ వర్తించదు.
నెట్వర్క్ పరీక్షించడానికి సరైన సమయం..
గతంలో సంస్థ అందించిన ఆఫర్‌తో పోలిస్తే వ్యాలిడిటీ, డేటా పరిమాణంలో కొన్ని మార్పులు చేసినప్పటికీ, ఒక్క రూపాయి ధరను అలాగే కొనసాగించడం విశేషం. పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించి దీర్ఘకాలిక రీఛార్జ్ ప్లాన్లు ఎంచుకునే ముందు, తమ ప్రాంతంలో బీఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ బలం, ఇంటర్నెట్ వేగం ఎలా ఉందో స్వయంగా సరిచూసుకోవాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం.
రీఛార్జ్ రేట్ల పెరుగుదలతో ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్న మొబైల్ యూజర్లను ఆకట్టుకోవడంలో బీఎస్ఎన్ఎల్ వ్యూహం ఎంతగానో పనిచేసేలా కనిపిస్తోంది. కొత్తగా కనెక్షన్ తీసుకోవాలనుకునే వారు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా నెట్వర్క్ పనితీరును స్వయంగా అనుభవించేందుకు ఇది సరైన సమయం.




