BSNL ₹1 Freedom Plan: రూ.1కే సిమ్.. 24 రోజుల పాటు బెనిఫిట్స్
బీఎస్ఎన్ఎల్ కొత్త యూజర్ల కోసం రూ.1కే ఫ్రీ సిమ్, ఫస్ట్ రీఛార్జ్ ఫ్రీ ఆఫర్ తెచ్చింది. 24 రోజుల పాటు డేటా, కాల్స్ లభిస్తాయి.
BSNL ₹1 Freedom Plan
BSNL ₹1 Freedom Plan : ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కొత్త వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. రూ.1కే సిమ్‌తో పాటు ఉచిత ఫస్ట్ రీఛార్జ్ అందించే ‘ఫ్రీడమ్ 2.0’ ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చింది. ఈ ప్రత్యేక ఆఫర్ సెప్టెంబర్ 12, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది.
రూ.1కే సిమ్.. ఫస్ట్ రీఛార్జ్ ఫ్రీ
కొత్తగా BSNL కనెక్షన్ తీసుకునే వినియోగదారులు కేవలం రూ.1 చెల్లించి సిమ్ పొందవచ్చు. అంతేకాకుండా ఫస్ట్ రీఛార్జ్ కూడా ఉచితంగా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో 24 రోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, ప్రతిరోజూ 1GB హైస్పీడ్ డేటా అందుతుంది.
అయితే ఈ ఆఫర్ కొత్త BSNL వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే BSNL సేవలను ఉపయోగిస్తున్న పాత వినియోగదారులకు ఈ ప్రయోజనం అందుబాటులో ఉండదు.
గతేడాది ప్లాన్‌తో పోలిస్తే మార్పులు
గత ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా BSNL ‘ఆజాదీ కా ప్లాన్’ పేరుతో రూ.1 ఆఫర్‌ను తీసుకొచ్చింది. అప్పట్లో 30 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2GB డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ అందించింది.
తాజాగా తీసుకొచ్చిన ‘ఫ్రీడమ్ 2.0’లో వ్యాలిడిటీని 24 రోజులకు తగ్గించింది. అదే సమయంలో రోజువారీ హైస్పీడ్ డేటాను 2GB నుంచి 1GBకి పరిమితం చేసింది.
రూ.2,399 ప్లాన్‌కు అదనపు వ్యాలిడిటీ
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా BSNL తన రూ.2,399 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌పైనా ప్రత్యేక ప్రయోజనాన్ని ప్రకటించింది. సాధారణంగా 365 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్‌కు అదనంగా 47 రోజులు జోడించింది.
దీంతో మొత్తం 412 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, రోజుకు 2GB హైస్పీడ్ డేటా అందుతాయి.
ఈ అదనపు వ్యాలిడిటీ ఆఫర్ ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 12, 2026 మధ్య రూ.2,399 ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు వర్తిస్తుంది.
మొత్తంగా చూస్తే.. కొత్తగా BSNLలోకి మారాలనుకునే వారికి రూ.1 ఫ్రీడమ్ 2.0 ప్లాన్ ఆకర్షణీయమైన ఆఫర్‌గా నిలవనుంది. ఇప్పటికే BSNL వినియోగిస్తున్నవారికి మాత్రం ఈ రూ.1 ఆఫర్ వర్తించదు.




