Business Ideas: ఈ కష్ట కాలంలో ఇదే బెస్ట్.. రూపాయి ఖర్చు లేకుండా చేసే బిజినెస్ ఐడియాలు
Business Ideas: ప్రస్తుతం నెలకొన్ని ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో చాలా మంది కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి ఉంది.
Business Ideas: ఈ కష్ట కాలంలో ఇదే బెస్ట్.. రూపాయి ఖర్చు లేకుండా చేసే బిజినెస్ ఐడియాలు
Business Ideas: ప్రస్తుతం నెలకొన్ని ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో చాలా మంది కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. అయితే ఈ డిజిటల్ యుగంలో ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండానే మొదలు పెట్టే ఎన్నో వ్యాపార అవకాశాలు ఉన్నాయి. అలాంటి వాటిలో కొన్ని ఇవి..
ఫ్రీలాన్స్ కంటెంట్ రైటింగ్‌తో ఆదాయం
మీకు రాయడం అంటే ఇష్టం ఉంటే కంటెంట్ రైటింగ్ మంచి అవకాశంగా మారుతుంది. ప్రస్తుతం వెబ్‌సైట్లు, న్యూస్ పోర్టల్స్, యూట్యూబ్ ఛానెల్స్, కంపెనీలు ప్రతిరోజూ కొత్త కంటెంట్ కోరుకుంటున్నాయి. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో రాయగల వారికి మంచి డిమాండ్ ఉంది. సోషల్ మీడియా, లింక్డిన్ లేదా ఫ్రీలాన్స్ వెబ్‌సైట్ల ద్వారా క్లయింట్లను సంప్రదించవచ్చు. మొబైల్ లేదా ల్యాప్‌టాప్, ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది. మొదట్లో ఆదాయం తక్కువగా ఉన్నా అనుభవం పెరిగేకొద్దీ ఆదాయం కూడా వేగంగా పెరుగుతుంది. ప్రస్తుతం చాలామంది ఇంట్లో నుంచే నెలకు వేలల్లో సంపాదిస్తున్నారు.
సోషల్ మీడియా మేనేజ్‌మెంట్‌కు భారీ డిమాండ్
ఇప్పుడు చిన్న వ్యాపారం నుంచి పెద్ద కంపెనీ వరకు అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలని చూస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరికి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్ వంటి ప్లాట్‌ఫారమ్‌లను సరిగ్గా నిర్వహించే సమయం లేదా అవగాహన ఉండదు. అందుకే సోషల్ మీడియా మేనేజర్లకు మంచి అవకాశాలు వస్తున్నాయి. మీకు రీల్స్ రూపొందించడం, పోస్టులు డిజైన్ చేయడం, క్యాప్షన్లు రాయడం లేదా ట్రెండ్స్ అర్థం చేసుకోవడం వచ్చి ఉంటే ఈ పని ద్వారా మంచి ఆదాయం సంపాదించవచ్చు. ప్రారంభంలో స్థానిక షాపులు, బుటిక్‌లు, కేఫేలు, చిన్న వ్యాపారాలతో పని మొదలుపెట్టవచ్చు. క్రమంగా క్లయింట్లు పెరిగితే ఆదాయం కూడా పెరుగుతుంది. ఇందులో పెట్టుబడి చాలా తక్కువ లేదా అసలు అవసరం ఉండదు.
అఫిలియేట్ మార్కెటింగ్‌తో ఇంటి నుంచే సంపాదన
ప్రస్తుతం వేగంగా పెరుగుతున్న ఆన్‌లైన్ బిజినెస్‌లలో అఫిలియేట్ మార్కెటింగ్ ఒకటి. ఇందులో కంపెనీలు లేదా ఈ-కామర్స్ వెబ్‌సైట్ల ఉత్పత్తులను మీరు ప్రమోట్ చేయాలి. మీ లింక్ ద్వారా ఎవరైనా కొనుగోలు చేస్తే మీకు కమిషన్ వస్తుంది.
ఇందులో ప్రత్యేకంగా మీ సొంత ఉత్పత్తి అవసరం ఉండదు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సాప్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సులభంగా ప్రారంభించవచ్చు. ప్రస్తుతం చాలామంది కేవలం మొబైల్‌తోనే అఫిలియేట్ మార్కెటింగ్ చేసి మంచి ఆదాయం పొందుతున్నారు.
విజయం సాధించాలంటే కష్టపడటం తప్పనిసరి
ఈ మూడు బిజినెస్‌లను పెద్ద పెట్టుబడి లేకుండానే ప్రారంభించవచ్చు. అయితే వెంటనే భారీ లాభాలు వస్తాయని ఆశించకూడదు. నిరంతరం నేర్చుకోవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, క్రమంగా పని చేయడం చాలా ముఖ్యం. ప్రారంభంలో ఫలితాలు నెమ్మదిగా కనిపించినా ఓపికతో కొనసాగితే కొన్ని నెలల్లోనే స్థిరమైన ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుత కాలంలో డబ్బు కంటే విలువైన పెట్టుబడి నైపుణ్యం, సమయం అని నిపుణులు చెబుతున్నారు.




