House vs Flat: ఇండిపెండెంట్ హౌస్ vs ఫ్లాట్.. ఏది కొనడం బెస్ట్ అంటే..?
House vs Flat: ప్రతి సామాన్యుడి జీవిత కల.. ఒక సొంత ఇల్లు. కానీ మారుతున్న కాలంలో ఇల్లు ఒక డెడ్ ఇన్వెస్ట్‌మెంట్ అనే వాదన గట్టిగా వినిపిస్తోంది.
House vs Flat: ఇండిపెండెంట్ హౌస్ vs ఫ్లాట్.. ఏది కొనడం బెస్ట్ అంటే..?
House vs Flat: మనకంటూ ఒక గూడు ఉండాలి. ఇది ప్రతి సామాన్యుడి జీవితకాల స్వప్నం. కానీ నేటి వేగవంతమైన ప్రపంచంలో ఈ ఆలోచనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇల్లు కొనడం ఆర్థికంగా లాభం లేని పని అంటే, మరికొందరు సొంతింటి భద్రత ముందు కోట్లు కూడా సాటిరావని వాదిస్తున్నారు.
ఆర్థిక నిపుణులు ఒక ఆసక్తికరమైన గణాంకాన్ని మన ముందు ఉంచారు. ఒక కోటిన్నర రూపాయలతో ఫ్లాట్ కొని, దానికి భారీగా ఈఎంఐ కట్టే బదులు.. నెలకు లక్ష రూపాయల చొప్పున సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ చేస్తే, 20 ఏళ్ల తర్వాత అది దాదాపు 7 నుండి 8 కోట్ల రూపాయల భారీ నిధిగా మారుతుంది. అదే సమయంలో కోటిన్నర పెట్టి కొన్న ఫ్లాట్ విలువ, తరుగుదల కారణంగా 20 ఏళ్ల తర్వాత కేవలం 2 నుండి 3 కోట్లకు మాత్రమే పరిమితం కావచ్చు. కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ పరంగా చూస్తే, అద్దె ఇంట్లో ఉంటూ డబ్బును ఇన్వెస్ట్ చేయడమే ఉత్తమమని అనిపిస్తుంది.
డబ్బుతో వెలకట్టలేని భద్రత
కానీ, జీవితం అంటే కేవలం అంకెలు, బ్యాంక్ నిల్వలు మాత్రమేనా? ఖచ్చితంగా కాదు అంటున్నారు నిపుణులు. సొంత ఇంట్లో ఉండే భద్రతా భావం, ముఖ్యంగా వృద్ధాప్యంలో లేదా కష్టకాలంలో ఇచ్చే మానసిక ధైర్యం అద్దె ఇల్లు ఇవ్వలేదు. తల్లిదండ్రులు మరణించినప్పుడు లేదా ఆపత్కాలంలో అద్దె ఇంట్లో ఉండేవారు ఎదుర్కొనే సామాజిక ఇబ్బందులు డబ్బుతో వెలకట్టలేనివి. ప్రస్తుత యువతలో ప్రాచుర్యం పొందుతున్న Double Income No Kids సంస్కృతిపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం భార్యాభర్తలు మాత్రమే ఒక చిన్న సర్కిల్‌లో బతకడం జీవితం కాదని, కుటుంబం, బంధువులతో కలిసి సుఖదుఃఖాలను పంచుకోవడమే అసలైన జీవనమని వారు స్పష్టం చేశారు. ఒక గూడు కేవలం ఇటుకలతో కట్టినది కాదు, అది అనుబంధాల నిలయం కావాలని గుర్తు చేశారు.
ఇండిపెండెంట్ హౌస్ vs ఫ్లాట్
చాలామందికి సొంత ఇంటి విషయంలో పెద్ద సందిగ్ధత ఉంటుంది.భూమి విలువ పెరుగుతుంది కానీ, అత్యవసర సమయాల్లో ఆ ఆస్తిని నగదుగా మార్చుకోవడం కష్టం. పైగా రేపటి తరం పిల్లలు మనం కట్టిన ఆ పెద్ద ఇంట్లోనే ఉంటారనే గ్యారెంటీ లేదు. ఫ్లాట్ నిర్వహణ సులభం, కమ్యూనిటీ లివింగ్ సౌకర్యవంతంగా ఉంటుంది.నిపుణుల సలహా ప్రకారం.. జీవితంలో అన్నీ బ్యాలెన్స్‌గా ఉండాలి. మరీ భారీ బడ్జెట్‌కి వెళ్లి అప్పుల ఊబిలో కూరుకుపోకుండా, మీ స్థాయికి తగ్గ ఒక మంచి ఫ్లాట్‌ను కొనుగోలు చేయండి. మిగిలిన ఆదాయాన్ని పిల్లల ఉన్నత చదువులకు, మీ రిటైర్మెంట్ ప్లాన్‌కు కేటాయించండి.




