DA Hike: మోదీ సర్కార్ బిగ్ డెసిషన్: పెన్షనర్లకు శుభవార్త.. పెరిగిన కరవు భత్యం..!

DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపునకు కేబినెట్ ఆమోదం. అలాగే నౌకల బీమా కోసం రూ.13 వేల కోట్లతో సావరిన్ మారిటైమ్ ఫండ్ ఏర్పాటు. కేబినెట్ భేటీ ముఖ్యాంశాలు ఇక్కడ చూడండి.

Arun Chilukuri
Published on: 18 April 2026 2:21 PM IST
DA Hike
X

DA Hike: మోదీ సర్కార్ బిగ్ డెసిషన్: పెన్షనర్లకు శుభవార్త.. పెరిగిన కరవు భత్యం..!

DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. శనివారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కరవు భత్యం (DA) పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత నౌకాయాన రంగానికి రక్షణ కల్పించేలా మరో ప్రతిష్టాత్మక నిర్ణయానికి ఆమోద ముద్ర వేసింది.

ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు:

పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇచ్చే కరవు భత్యాన్ని (DA/DR) మరో 2 శాతం పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా జనవరి, జూలై నెలల్లో ఈ సవరణ జరగాల్సి ఉండగా, ఈసారి ప్రకటనలో జాప్యం జరగడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమైంది. తాజా పెంపుతో లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.

రూ.13,000 కోట్లతో సావరిన్ మారిటైమ్ ఫండ్:

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. భారత జెండా కలిగిన నౌకలకు మరియు భారత్ నుంచి రాకపోకలు సాగించే నౌకలకు బీమా కవరేజీ అందించేందుకు రూ.13,000 కోట్లతో 'సావరిన్ మారిటైమ్ ఫండ్' ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతర్జాతీయ బీమా సంస్థలు అధిక ప్రీమియం వసూలు చేస్తున్న తరుణంలో, మన నౌకలకు రక్షణ కల్పించడమే ఈ నిధి ప్రధాన లక్ష్యం.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story