Car Loan: కారు లోన్ ఏ బ్యాంకు ఎంత వడ్డీ రేటుకు ఇస్తుందో తెలుసా.? ఆసక్తికర విషయాలు

Car Loan: కారు లోన్‌లో గరిష్టంగా 7 ఏళ్ల వరకు టెన్యూర్ ఉంటుంది. యూకో బ్యాంకులో అత్యంత తక్కువగా 7.35 శాతం నుంచి ఇంట్రెస్ట్ రేట్ మొదలవుతుంది.

Ravi
By Ravi
Published on: 25 Oct 2026 7:46 AM IST
Car Loan
X

Car Loan: కారు లోన్ ఏ బ్యాంకు ఎంత వడ్డీ రేటుకు ఇస్తుందో తెలుసా.? ఆసక్తికర విషయాలు

Car Loan: కారు లోన్‌లో గరిష్టంగా 7 ఏళ్ల వరకు టెన్యూర్ ఉంటుంది. యూకో బ్యాంకులో అత్యంత తక్కువగా 7.35 శాతం నుంచి ఇంట్రెస్ట్ రేట్ మొదలవుతుంది.

బ్యాంకింగ్ రంగంలో వివిధ రకాల రుణాలు అలాగే వాటి వడ్డీ రేట్లకు సంబంధించి ఎప్పుడూ ఆసక్తికరమైన వివరాలు వెలువడుతుంటాయి. ముఖ్యంగా కారు కొనుగోలు చేయాలనుకునే వారికి బ్యాంకులు అందించే లోన్ ఆఫర్లు చాలా కీలకంగా మారుతుంటాయి. ఈ నేపథ్యంలో వివిధ బ్యాంకులలో కారు లోన్లపై వసూలు చేస్తున్న వడ్డీ రేట్లకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కస్టమర్లు ఈ వివరాలను గమనించి తగిన నిర్ణయం తీసుకోవచ్చు.

కార్ లోన్‌లో గరిష్టంగా 7 ఏళ్ల వరకు టెన్యూర్ ఉంటుంది. యూకో బ్యాంకులో అతి తక్కువగా 7.35శాతం నుంచి ఇంట్రెస్ట్ రేట్ మొదలవుతుంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అలాగే కెనరా బ్యాంకులో 7.45శాతం వడ్డీ రేటు ఉంది. యూనియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 7.50శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 7.55శాతం చొప్పున వడ్డీ రేటు నిర్ణయించారు.

అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీఎన్‌బీ బ్యాంకులలో 7.60శాతం వడ్డీ రేటు అమలవుతోంది. ఐడీబీఐ బ్యాంకులో 7.75శాతం వరకు వడ్డీ రేటు ఉండగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో 8.25శాతం వడ్డీ రేటు ఉంది. ఎస్బీఐ బ్యాంకులో 8.30శాతం చొప్పున, ఐసీఐసీఐ బ్యాంకులో 8.40శాతం వడ్డీ రేటు వసూలు చేస్తున్నారు. యాక్సిస్ బ్యాంకులో 8.95శాతం నుంచి వడ్డీ రేట్లు మొదలవుతున్నట్లు అధికారికంగా వెల్లడించారు.

రుణాలు తీసుకునే ముందు వివిధ బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్లను సరిపోల్చుకోవడం కస్టమర్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వడ్డీ రేట్లలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.