Unknown Calls: నవంబర్ 1 నుంచి కొత్త రూల్.. తెలియని నంబర్‌ నుంచి కాల్ వచ్చినా ఇకపై నో ప్రాబ్లం..!

Unknown Calls: భారత్‌లో మొబైల్ వినియోగదారులకు కీలక మార్పు రాబోతోంది. నవంబర్ 1, 2026 నుంచి కాల్ వచ్చినప్పుడు తెలియని నంబర్‌ అయినా కాలర్ పేరు కనిపించేలా కొత్త వ్యవస్థ అమల్లోకి రానుంది.

Venkat
Updated on: 23 Oct 2026 11:51 AM IST
Unknown Calls
X

Unknown Calls: నవంబర్ 1 నుంచి కొత్త రూల్.. తెలియని నంబర్‌ నుంచి కాల్ వచ్చినా ఇకపై నో ప్రాబ్లం..!

Unknown Calls: భారత్‌లో మొబైల్ వినియోగదారులకు నవంబర్ 1, 2026 నుంచి కొత్త కాలింగ్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) ఆదేశాల ప్రకారం కాలింగ్ నేమ్ ప్రెసెంటేషన్ (CNAP) వ్యవస్థను టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు అమలు చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా ఫోన్‌లో సేవ్ చేయని నంబర్‌ నుంచి కాల్ వచ్చినప్పుడు కేవలం నంబర్ మాత్రమే కాకుండా, ఆ నంబర్‌కు సంబంధించిన పేరు కూడా స్క్రీన్‌పై కనిపిస్తుంది.

ఇప్పటివరకు ఫోన్‌లో సేవ్ చేయని నంబర్‌ నుంచి కాల్ వస్తే దాని వివరాలు తెలుసుకోవడానికి చాలామంది థర్డ్ పార్టీ కాలర్ ఐసీ యాప్స్‌పై ఆధారపడుతున్నారు. సీఎన్ఏపీ అందుబాటులోకి వచ్చిన తర్వాత టెలికాం నెట్‌వర్క్ స్థాయిలోనే కాలర్ పేరు చూపించే విధానం ఏర్పడుతుంది.

సీఎన్ఏపీ ఎలా పనిచేస్తుంది?

ఒక వ్యక్తి మీకు కాల్ చేసినప్పుడు అతని నంబర్ మీ కాంటాక్ట్స్‌లో సేవ్ అయి లేకపోతే, ఫోన్ స్క్రీన్‌పై ఆ నంబర్‌తో పాటు పేరు కనిపిస్తుంది. ఈ పేరు టెలికాం సంస్థల వద్ద నమోదైన వివరాల ఆధారంగా ప్రదర్శించబడుతుంది. సాధారణంగా సిమ్ కార్డు తీసుకునే సమయంలో నమోదైన పేరు దీనికి ఆధారంగా ఉంటుంది.

అంటే, మీ ఫోన్‌బుక్‌లో ఒక నంబర్ సేవ్ చేయకపోయినా, ఆ వ్యక్తి పేరు టెలికాం డేటాబేస్‌లో ఉన్నట్లయితే కాల్ వచ్చిన సమయంలో అది కనిపించే అవకాశం ఉంటుంది.

4G, 5G యూజర్లకు ముందుగా..

DoT మార్గదర్శకాల ప్రకారం 4G, 5G నెట్‌వర్క్‌లలో సీఎన్ఏపీ అమలు చేయనున్నారు. 2G, 3G నెట్‌వర్క్‌ల కోసం ఈ సేవను తర్వాత దశలో అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఈ మార్పుతో తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను వినియోగదారులు మరింత సులభంగా గుర్తించగలుగుతారు. ముఖ్యంగా మోసపూరిత కాల్స్, అనుమానాస్పద కమ్యూనికేషన్‌ను గుర్తించడంలో ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

ఇంటర్నేషనల్ కాల్స్ వస్తే?

విదేశాల నుంచి వచ్చే కాల్స్‌కు సంబంధించి కూడా ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అంతర్జాతీయ కాల్‌గా వచ్చినప్పుడు మొబైల్ స్క్రీన్‌పై అది ఇంటర్నేషనల్ కాల్స్ గా కనిపించే విధానం ఉంటుంది.

సీఎన్ఏపీ ద్వారా కాలర్ వివరాలను నెట్‌వర్క్ స్థాయిలో అందించడం వల్ల తెలియని కాల్స్ విషయంలో వినియోగదారులకు అదనపు సమాచారం లభిస్తుంది. అయితే పేరు కనిపించడం మాత్రమే కాల్ పూర్తిగా సురక్షితమైనదని అర్థం కాదు. అనుమానాస్పద కాల్స్‌లో వ్యక్తిగత, బ్యాంకింగ్ లేదా ఓటీపీ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోకపోవడం ముఖ్యం.

మొత్తంగా, నవంబర్ 1 నుంచి సీఎన్ఏపీ అమలు మొబైల్ కాలింగ్ అనుభవంలో కీలక మార్పుగా మారనుంది. తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు ఆ నంబర్ వెనుక ఉన్న నమోదిత పేరు తెలుసుకునే అవకాశం వినియోగదారులకు లభించనుంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.