Credit Card: క్రెడిట్ కార్డుతో ఇంటి అద్దె చెల్లిస్తున్నారా? ఈ 5 తప్పులు అస్సలు చేయకండి!
Credit Card: ఇప్పుడు ఇంటి అద్దెను ఆన్‌లైన్‌లో చెల్లించడం చాలా సులభమైంది. కొందరు క్రెడిట్ కార్డుతో కూడా అద్దె చెల్లిస్తున్నారు. ఇలా చేయడం వల్ల పేమెంట్ సులభంగా పూర్తవుతుంది.
Credit Card: క్రెడిట్ కార్డుతో ఇంటి అద్దె చెల్లిస్తున్నారా? ఈ 5 తప్పులు అస్సలు చేయకండి!
Credit Card: కొన్ని కార్డులపై రివార్డ్ పాయింట్లు కూడా లభిస్తాయి. అయితే క్రెడిట్ కార్డుతో అద్దె చెల్లించే విషయంలో కొన్ని తప్పులు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.
ప్రాసెసింగ్ ఫీజు
కొన్ని ప్లాట్‌ఫామ్‌లు అద్దె చెల్లింపుపై కన్వీనియన్స్ లేదా ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తాయి. ఈ ఛార్జీ సుమారు 2 శాతం వరకు ఉండొచ్చు. ఉదాహరణకు, నెలకు రూ.30,000 అద్దె చెల్లిస్తే 2 శాతం ఫీజు అంటే రూ.600 అదనంగా చెల్లించాలి. ఏడాదికి ఈ అదనపు ఖర్చు రూ.7,200 అవుతుంది. దీంతో వచ్చే రివార్డ్ పాయింట్ల ప్రయోజనం కూడా తగ్గిపోవచ్చు.
క్రెడిట్ లిమిట్‌ను ఎక్కువగా ఉపయోగించవద్దు
క్రెడిట్ కార్డుతో ప్రతి నెల అద్దె చెల్లిస్తే మీ కార్డు లిమిట్‌లో పెద్ద మొత్తాన్ని ఉపయోగించే పరిస్థితి రావచ్చు. ఉదాహరణకు, మీ కార్డు లిమిట్ రూ.1 లక్ష అనుకుందాం. అందులో రూ.40,000 అద్దె కోసం ఖర్చు చేస్తే 40 శాతం లిమిట్ ఇప్పటికే ఉపయోగించినట్టే.
దీనికి ఇతర ఖర్చులు కూడా కలిస్తే క్రెడిట్ యుటిలైజేషన్ మరింత పెరుగుతుంది. కార్డు లిమిట్‌లో ఎక్కువ భాగాన్ని నిరంతరం ఉపయోగించడం మీ క్రెడిట్ ప్రొఫైల్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే అద్దెతో పాటు ఇతర క్రెడిట్ కార్డు ఖర్చులను కూడా జాగ్రత్తగా నిర్వహించాలి.
మినిమమ్ అమౌంట్ చెల్లించకండి
క్రెడిట్ కార్డు బిల్లులో తక్కువ మొత్తంలో కనిపించే మినిమమ్ అమౌంట్‌ను మాత్రమే చెల్లించడం సులభంగా అనిపించొచ్చు. కానీ మిగిలిన మొత్తంపై వడ్డీ పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రతి నెల అద్దెను క్రెడిట్ కార్డుతో చెల్లిస్తూ, బిల్లును పూర్తిగా క్లియర్ చేయకపోతే బకాయి మొత్తం పెరుగుతూ పోవచ్చు.
అందుకే క్రెడిట్ కార్డుతో అద్దె చెల్లించినా బిల్లు వచ్చిన తర్వాత సాధ్యమైనంత వరకు పూర్తి మొత్తాన్ని డ్యూ డేట్‌లోపు చెల్లించడం మంచిది. లేకపోతే అద్దెపై అదనపు ఫీజుతో పాటు క్రెడిట్ కార్డు వడ్డీ కూడా భారం కావచ్చు.
అద్దె చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ పెరుగుతుందని అనుకోకండి
ప్రతి నెల అద్దెను సమయానికి చెల్లించడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ తప్పనిసరిగా పెరుగుతుందని భావించకండి. సాధారణంగా UPI లేదా బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ ద్వారా చేసే అద్దె చెల్లింపులు రుణం లేదా క్రెడిట్ కార్డు చెల్లింపుల మాదిరిగా క్రెడిట్ బ్యూరోలకు రిపోర్ట్ కావు.
కొన్ని ప్లాట్‌ఫామ్‌లు రెంట్ రిపోర్టింగ్ సదుపాయం అందించవచ్చు. అయితే అలాంటి సేవను ఉపయోగించే ముందు మీ అద్దె చెల్లింపు నిజంగా క్రెడిట్ బ్యూరోలకు రిపోర్ట్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవాలి. అలాగే క్రెడిట్ కార్డు బిల్లుకు సంబంధించిన డ్యూ డేట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు.
అద్దెను సమయానికి చెల్లించినా క్రెడిట్ కార్డు బిల్లును ఆలస్యంగా చెల్లిస్తే లేట్ ఫీజు, వడ్డీ వంటి అదనపు ఖర్చులు రావచ్చు. అంతేకాకుండా ఆలస్య చెల్లింపులు మీ క్రెడిట్ చరిత్రపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.
కాబట్టి క్రెడిట్ కార్డుతో అద్దె చెల్లించేటప్పుడు ఫీజులు, క్రెడిట్ లిమిట్, పూర్తి బిల్లు చెల్లింపు, రిపోర్టింగ్ నిబంధనలు, డ్యూ డేట్.. ఈ ఐదు విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి.




