stock market: ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించిన కండోమ్ కంపెనీ!

stock market: మల్టీబ్యాగర్ స్టాక్ కుపిడ్ లిమిటెడ్ గత పదేళ్లలో 14,057 శాతం భారీ రాబడిని అందించి ఆల్‌టైమ్ గరిష్ఠాన్ని తాకింది.

Gagan kumar
Published on: 10 Oct 2026 8:31 AM IST
stock market
X

stock market: ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించిన కండోమ్ కంపెనీ!

Cupid Limited: భారత స్టాక్ మార్కెట్‌లో దీర్ఘకాలిక పెట్టుబడుల మహిమే వేరు. సరైన నాణ్యమైన కంపెనీని ఎంచుకుని ఓపికగా ఉంటే.. అది ఇన్వెస్టర్ల రాతనే మార్చేస్తుందని నిరూపించింది 'కుపిడ్ లిమిటెడ్'. కండోమ్‌లు, పర్సనల్ హెల్త్‌కేర్ ఉత్పత్తులను తయారు చేసే ఈ కంపెనీ షేరు గత పదేళ్లలో ఏకంగా 14,057 శాతం ఆల్మోస్ట్ అద్భుతమైన రాబడిని అందించి మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. భారతదేశానికి చెందిన ప్రసిద్ధ తయారీ సంస్థల్లో కుపిడ్ లిమిటెడ్ ఒకటి. ఈ కంపెనీ పురుషులు, మహిళల కండోమ్‌లతో పాటు నీటి ఆధారిత లూబ్రికెంట్ జెల్లీలు, వైద్య పరీక్షల్లో వాడే IVD కిట్లను ఉత్పత్తి చేస్తుంది. సొంతంగా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కేంద్రాన్ని కలిగి ఉన్న ఈ సంస్థ, కేవలం దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలోనూ తన ఉత్పత్తులను విక్రయిస్తూ బలమైన పునాది వేసుకుంది.

గత కొన్ని సంవత్సరాలుగా ఈ షేరు నమోదు చేసిన ప్రగతి ఇన్వెస్టర్లను విస్మయానికి గురిచేస్తోంది. ఇటీవలే బిఎస్‌ఈలో ఈ షేరు సుమారు 3 శాతం పెరిగి రూ.368 వద్ద కొత్త ఆల్‌టైమ్ గరిష్ఠాన్ని తాకింది.కంపెనీ కేవలం షేరు ధర పెరగడమే కాకుండా, బోనస్ షేర్ల రూపంలోనూ వాటాదారులకు అదనపు లాభాలను ఇచ్చింది. ఇటీవల మార్చి 2026లో 1:4 నిష్పత్తిలో ఉచిత షేర్లను ప్రకటించింది. అంతకుముందు 2024లో 1:1 నిష్పత్తిలో, 2018లో 5:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను అందించి ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేసింది.

మార్కెట్‌లో గతంలో వచ్చిన భారీ లాభాలు భవిష్యత్తులోనూ అంతే స్థాయిలో వస్తాయని గ్యారెంటీ లేదు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు ప్రమాదంతో కూడుకున్నవి. కాబట్టి ఏదైనా స్టాక్‌లో పెట్టుబడి పెట్టే ముందు నిపుణులైన ఫైనాన్షియల్ అడ్వైజర్‌ను సంప్రదించడం మంచిది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.