DGCA New Rules: విమాన ప్రయాణీకులకు గుడ్ న్యూస్..హిడెన్ ఛార్జెస్ బాదుడు తప్పుతుంది!
DGCA New Rules: విమాన సీట్ల ఎంపికపై డీజీసీఏ కొత్త రూల్స్. 60 శాతం సీట్లు ఇందుకోసం ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా కేటాయించాలని ఆదేశించింది.
DGCA New Rules
DGCA New Rules: ఫ్లైట్ జర్నీ కోసం టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఎన్నో హిడెన్ ఛార్జెస్ పడుతుంటాయి. ముఖ్యంగా నచ్చిన సీటు కోసం.. లేదా ఇద్దరు జర్నీ చేస్తున్నపుడు పక్క పక్కనే సీట్ కావాలని కోరినపుడు అదనపు ఛార్జెస్ విధించడం జరుగుతూ వస్తుంది. దీనిపై చాలా కాలంగా విమాన ప్రయాణాలు చేసేవారి నుంచి కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి. దీనిపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది.
విమాన పరయాణీకులకు సీటు ఎంపిక కోసం విధిస్తున్న ఎడిషనల్ ఛార్జెస్ అదుపు చేయడం.. ప్రయాణీకుల హక్కుల పరిరక్షణ విషయంలో కఠిన నిర్ణయాలను తీసుకుంది ప్రభుత్వం. దీని ప్రకారం ఏ విమానంలోనైనా సరే 60 శాతం సీట్లను ప్రయాణీకుల ఎంపిక కోసం ఉచితంగా ఉంచాలి. అంటే, ఎవరైనా టికెట్ బుక్ చేసుకునేప్పుడు ఈ 60 శాతం సీట్లలో లభ్యతను బట్టి తమకు కావాలనుకునే సీటును ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. వీటిపై అదనపు ఛార్జీలు విమానయాన సంస్థలు విధించలేవు. అదేవిధంగా ఒకే టికెట్ పై ప్రయాణించే ప్రయాణీకులందరికీ వీలైనంత వరకు ఒకే దగ్గర పక్క పక్క సీట్లు కేటాయించాలని కూడా ఆదేశాలు జరీ అయ్యాయి. అంటే ఒకే పీఎన్ఆర్ నెంబర్ పై టికెట్ బుక్ చేసుకున్న అందరికీ పక్క పక్కన ఒకే దగ్గర సీట్లు కేటాయింపు జరుగుతుంది.
సామాను, పెంపుడు జంతువుల కోసం..
భద్రతా నియమాలను పాటిస్తూనే విమానయాన సంస్థలు క్రీడా పరికరాలు, సంగీత వాయిద్యాలు వంటి సామానులు రవాణా, అలాగే పెంపుడు జంతువుల రవాణా విషయాల్లో ప్రయాణీకులకు అనుకూలమైన విధంగా నిబంధనలు రూపొందించాలని విమానయాన సంస్థలకు ప్రభుత్వం సూచించింది.
ప్రయాణీకుల హక్కులే ముఖ్యం..
విమానాల ఆలస్యం, రద్దు అలాగే, ప్రయాణానికి అనుమతి ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రయాణీకుల హక్కులను కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. విమానయాన సంస్థలు తమ వెబ్సైట్స్, మొబైల్ యాప్స్, బుకింగ్ ప్లేట్ ఫామ్స్ అదేవిధంగా విమానాష్య్ర కౌంటర్లలో ఈ రూల్స్ ను ప్రముఖంగా కనిపించేలా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చెప్పింది. ఈ నిబంధనలను ప్రాంతీయ భాషల్లో కూడా ప్రదర్షించాల్సి ఉంటుంది.




